https://oktelugu.com/

Star heroes : సినిమాల్లో నెగెటివ్ షేర్ అంటే ఏంటి..? దీని గురించి మాట్లాడితే స్టార్ హీరోలకు ఎందుకు కోపం వస్తుంది..?

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయడం అనేది అంత ఆశామాషి వ్యవహారమైతే కాదు. ప్రొడ్యూసర్ తన శాయ శక్తుల ప్రయత్నం చేసి డబ్బులను కూడగట్టి ఒక సినిమాని చేస్తూ ఉంటాడు.

Written By: , Updated On : December 17, 2024 / 12:33 PM IST
movie

movie

Follow us on

Star heroes : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయడం అనేది అంత ఆశామాషి వ్యవహారమైతే కాదు. ప్రొడ్యూసర్ తన శాయ శక్తుల ప్రయత్నం చేసి డబ్బులను కూడగట్టి ఒక సినిమాని చేస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమా సక్సెస్ అయితే పర్లేదు. కానీ ఫెయిల్యూర్ అయితే మాత్రం విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.

ఇక సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా చేయడం వల్ల అందరూ హ్యాపీగా ఉంటారు
కానీ ఆ సినిమా తేడా కొడితే మాత్రం ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా ప్రొడ్యూసర్ మాత్రం డబ్బుల పరంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమాలు చేసి నష్టపోయి ఉన్నదంతా అమ్ముకొని ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రాఫిట్స్, లాసెస్ అనేవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం… కానీ ‘నెగెటివ్ షేర్’ అనే ఒక మాటని మనం ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ విని ఉండము… కారణం ఏంటి అంటే దాని గురించి ఎక్కడ ఎవరు పెద్దగా మాట్లాడుకోరు. నిజానికి నెగిటివ్ షేర్ అంటే ఒక సినిమాని నిర్మాత దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ కొనుక్కున్న తర్వాత దాన్ని ఎగ్జిబ్యూటర్ కి ఇచ్చి థియేటర్ లో సినిమాలను ఆడిస్తాడు. ఒకవేళ ఆ సినిమా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకొని కనీసం ఆ సినిమాని చూడడా
నికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించకపోతే థియేటర్ కి సంబంధించిన రెంట్స్, కరెంటు బిల్లులు, కూడా రాలేని పరిస్థితి ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్లకు కొన్ని డబ్బులను చెల్లిస్తూ ఉంటాడు. దానినే ‘నెగిటివ్ షేర్’ అంటారు. ఇలాంటి సినిమాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు భారీగా నష్టపోతారు. ముఖ్యంగా ఈ నష్టం అనేది ప్రొడ్యూసర్ల మీద కూడా పడుతుంది…ఇక తమ సినిమాలకు నెగెటివ్ షేర్ వచ్చిందని చెప్పుకోడానికి హీరోలు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తద్వారా వాళ్లకు మార్కెట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నెగెటివ్ షేర్ గురించి ఎవరు, ఎక్కడ మాట్లాడరు ఇక ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా మాట్లాడరు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ చేసిన కొన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్లు నెగెటివ్ షేర్ ను ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఎదురయింది. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం…

చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు సినిమాకి నెగిటివ్ షేర్ ని చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది… ఇక బాలయ్య బాబు హీరోగా వచ్చిన ఒక్క మగాడు సినిమాకి నెగెటివ్ షేర్ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది… ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన షాడో, నాగార్జున నటించిన భాయ్, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, మహేష్ బాబు ఖలేజా, జూనియర్ ఎన్టీఆర్ శక్తి, అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో, ప్రభాస్ రెబల్, రామ్ చరణ్ ఆరెంజ్ లాంటి డిజస్టర్ సినిమాలకు నెగెటివ్ షేర్ చెల్లించాల్సిన అవకాశం అయితే వచ్చింది…

ఒక సినిమాని తీసేటప్పుడు దర్శకుడు తన విజన్ కి తగ్గట్టుగా ఆ సినిమాని తెరకెక్కిస్తే ప్రతి ఒక్కరూ లాభాపడుతారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇదిలా ఉంటే పైన చెప్పుకున్న నెగెటివ్ షేర్ గురించి బయట ప్రొడ్యూసర్లు గానీ, డిస్ట్రిబ్యూటర్లు గానీ మాట్లాడితే ఆయా సినిమాల హీరోలు ఆ ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లకు మరొక సినిమా ఇవ్వరు…

కాబట్టి దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు…ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడైతే ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు… కాబట్టి ప్రతి ఒక్క సినిమా ప్రాఫిట్స్ ని అందుకుంటు ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకొని దూసుకెళ్తున్నాయి…