Rains Alert in AP
AP Rains : ఏపీకి వర్ష సూచన. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈరోజు కోస్తా తో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని చెబుతున్నారు. మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం కూడా వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమపై వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.
* ఈ రెండు నెలల్లో కామన్
సాధారణంగా నవంబరు, డిసెంబరు వస్తే చాలు తుఫాన్లు సంభవించడం జరుగుతుంటుంది. ఈ రెండు నెలల్లో ఖరీఫ్ నకు సంబంధించి పనులు ముమ్మరంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా వరి కోతలు, నూర్పులు చేస్తుంటారు. ఈ సమయంలో వర్షాలు పడితే రైతులకు ఇక్కట్లు తప్పవు. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు సైతం వేగవంతంగా పూర్తి చేస్తుంది ప్రభుత్వం. ఇంకోవైపు మత్స్యకారులు వేటకు దూరమవుతున్నారు. చేపల వేట లేక ఉపాధికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈనెల 20 వరకు వర్షాలు పడనుండడంతో ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
* మరోవైపు చలి పులి
ఒకవైపు వర్ష సూచనతో బెంబేలెత్తిపోతున్నారు రాష్ట్ర ప్రజలు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉదయం 10 గంటల వరకు పొగ మంచు వీడడం లేదు. ఉష్ణోగ్రతలు అమాంతం పగుముక్కం పడుతున్నాయి. ఏజెన్సీలో చలిగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల తక్కువే నమోదవుతున్నాయి. చలి దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కురుస్తూనే ఉంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.