Mahesh Babu Varanasi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడు. ఆయన ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ సక్సెస్ లను సాధించాడు. దాంతో ప్రస్తుతం ఇండియాలో ఆయన నెంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని అభిమానులకు సైతం ఆనందపడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో చేసిన రాజాసాబ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. దాంతోపాటు గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాని సైతం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు… మహేష్ బాబు లాంటి నటుడు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్థాయిని భారీ రేంజ్ లో ఎలివేట్ చేసుకున్నాడు. ‘పోకిరి’ సినిమాతో ఇప్పుడున్న స్టార్ హీరోలందరి కంటే ముందే ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా చేయలేదు. కానీ రాజమౌళితో చేస్తున్న సినిమాతో డైరెక్ట్ పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
నిన్న ‘గ్లోబ్ ట్రిట్టర్’ పేరుతో రాజమౌళి ఒక ఈవెంట్ ను కండక్ట్ చేశాడు. ఈ ఈవెంట్లో మహేష్ బాబు యొక్క క్యారెక్టరైజేషన్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక గ్లింప్స్ రిలీజ్ చేశాడు…ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ మహేష్ బాబు ఇందులో రాముడు పాత్రను పోషిస్తున్నాడు…
ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ ఇప్పటికే ‘ఆది పురుషు’ సినిమాలో రాముడిగా నటించి బొక్క బోర్ల పడ్డాడు. ఇక దానికి తోడుగా ప్రభాస్ లుక్స్ మీద కూడా చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. ఆయన లుక్స్ చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయని చాలామంది సినిమా ప్రముఖులు సైతం అతని మీద విమర్శలు చేశారు.
మొత్తానికైతే సినిమా డిజాస్టర్ గా మారింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు సైతం రాముడు పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది. మహేష్ బాబుకి సినిమా ఏ రకంగా యూజ్ అవుతోంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…