Baby John Movie : సౌత్ ఇండియా స్టార్ లేడీ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ బేబీ జాన్. ఈ చిత్రంతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టింది. బేబీ జాన్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం తేరి రీమేక్. 2016లో విడుదలైన తేరి సూపర్ హిట్. ఆ చిత్రానికి దాదాపు 9 ఏళ్ల అనంతరం రీమేక్ చేశారు. కలీస్ దర్శకుడు. తేరి దర్శకుడు అట్లీ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న బేబీ జాన్ విడుదల చేశారు. బేబీ జాన్ విజయం కోసం ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా కీర్తి సురేష్ బాగా కష్టపడింది.
డిసెంబర్ 12న వివాహం చేసుకున్న కీర్తి సురేష్ హనీ మూన్ కూడా పక్కన పెట్టేసింది. మెడలో తాళి బొట్టుతో ముంబై ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంది. కీర్తి సురేష్ డెడికేషన్ ని పలువురు కొనియాడారు. అయితే కీర్తి సురేష్ కష్టానికి ఫలితం దక్కలేదు. బేబీ జాన్ మూవీ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. విడుదలై నాలుగు వారాలు అవుతున్నా కూడా పుష్ప 2 బేబీ జాన్ కంటే మెరుగైన వసూళ్లు రాబడుతుంది.
దాదాపు రూ. 160 కోట్ల బడ్జెట్ తో బేబీ జాన్ నిర్మించారు. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి బేబీ జాన్ పెద్ద మొత్తంలో నష్టాలు మిగల్చనుంది. మరో వారం రోజుల్లో బేబీ జాన్ థియేట్రికల్ రన్ ముగిసే సూచనలు కలవు. దాంతో అనుకున్న సమయం కంటే ముందే ఓటీటీలో స్ట్రీమ్ కానుందట. బేబీ జాన్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జనవరి మూడు లేదా నాలుగో వారంలో బేబీ జాన్ ఓటీటీలో అందుబాటులోకి రానుందట.
ఇక బేబీ జాన్ కథ విషయానికి వస్తే.. భార్యను కోల్పోయిన ఒక సిన్సియర్ పోలీస్ అధికారి తన కూతురితో పాటు ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు. ఎవరు ఈ పోలీస్? భార్య ఎలా చనిపోయింది? తన శత్రువులు ఎవరు? వారిని హీరో ఎలా అంతం చేశాడు? అనేది కథ. బేబీ జాన్ మూవీలో వామిగా గబ్బి మరో హీరోయిన్ గా నటించింది.