https://oktelugu.com/

రేటింగ్స్ పడిపోతుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు?

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ షోగా కొనసాగుతోంది. బిగ్ బాస్-1..2..3 సీజన్లు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం అవుతుందని సంతోషపడిన ప్రేక్షకులకు చివరకు నిరాశే ఎదురవుతోంది. రోజురోజుకు పడిపోతున్న టీఆర్పీ చూస్తుంటేనే ఈ విషయం అర్థమవుతోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కరోనా టైంలో బిగ్ బాస్-4 ప్రారంభం అవుతుందనే తెలియగానే ఓ వర్గం ప్రేక్షకులు చాలా సంబరపడిపోయాయి. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లను […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 04:53 PM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ షోగా కొనసాగుతోంది. బిగ్ బాస్-1..2..3 సీజన్లు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం అవుతుందని సంతోషపడిన ప్రేక్షకులకు చివరకు నిరాశే ఎదురవుతోంది. రోజురోజుకు పడిపోతున్న టీఆర్పీ చూస్తుంటేనే ఈ విషయం అర్థమవుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కరోనా టైంలో బిగ్ బాస్-4 ప్రారంభం అవుతుందనే తెలియగానే ఓ వర్గం ప్రేక్షకులు చాలా సంబరపడిపోయాయి. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లను చూసి ప్రేక్షకులు నిరుత్సాహం చెందారు. షోలో సెలబ్రెటీలు ఎవరు లేకపోవడంతో తొలిరోజు నుంచే బిగ్ బాస్-4 కార్యక్రమం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

    Also Read: ప్రభాస్‌ను కలవాలంటే 300 కోట్లు చేతిలో ఉండాల్సిందే

    బిగ్ బాస్-4 హోస్టుగా నాగార్జున అలరిస్తున్నప్పటికీ కంటెస్టెంట్లతో ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కావడం లేదని తెలుస్తోంది. గంగవ్వ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు టీఆర్పీ 8 ఉండగా ఆమె వెళ్లిన తర్వాత క్రమంగా పడిపోతూ వస్తోంది. మిగతా భాషల్లో ఏదోఒక కాంట్రవర్సీలతో అదిరిపోయే టీఆర్పీ తెచ్చుకుంటోంది. అయితే తెలుగులో మాత్రం బిగ్ బాస్ ఆకట్టుకోలేక చతికిలబడుతున్నాడు.

    7వ వారంలో బిగ్ బాస్-4 టీఆర్పీ 5.2మాత్రమే రావడంతో నిర్వాహాకులు ఖంగుతిన్నారు. ఇక దసరా రోజున బిగ్ బాస్ హౌస్ లో సమంత సందడి చేయగా 7.2మాత్రమే వచ్చింది. స్టార్ హీరోయిన్ సమంత వస్తే 10కిపైగా వస్తుందని నిర్వాహాకులు అనుకున్నారు. ఇక వీక్ డేస్ లో యవరేజ్ రేటింగ్ 4.6టీఆర్పీకి పడిపోయింది. వీటికితోడు ఎలిమినేషన్స్ లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

    Also Read: మెగా హీరోల దండయాత్ర మొదలుకానుందా?

    ప్రస్తుతం బిగ్ బాస్ కు వస్తున్న రేటింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇంత దారుణమైన రేటింగ్స్ వస్తుంటే బిగ్ బాస్ నిర్వాహాకులు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. తెలుగులో నెంబర్ వన్ షోగా చెప్పుకునే బిగ్ బాస్.. ఇంత దారుణంగా దిగజాగరడం అందరనీ విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా బిగ్ బాస్ తన మార్క్ ఎంటటైన్మెంట్ చూపిస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!