Telangana Vs Andhra Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరబాద్ లో అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీని తెలంగాణ ఇండస్ట్రీ గా కొంతమంది పరిగణిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ నటులకు ఇండస్ట్రీలో ఎదగనివ్వలేదు అనే వార్తలైతే వచ్చాయి. కానీ ఇప్పుడు తెలంగాణ నటులే ఎక్కువైపోతున్నారు. దీనివల్ల ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుతో వాళ్ళు కూడా సెపరేట్ గా ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే వైజాగ్ లో ఆంధ్రా ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని కొంతమంది కొన్ని సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది… ఇటు తెలంగాణ ఇండస్ట్రీ, అటు ఆంధ్ర ఇండస్ట్రీ అని రెండు ఏర్పడితే కనుక ఎవరు ఎక్కువగా లాభపడతారు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. తెలంగాణ ఇండస్ట్రీ ఇలానే ఉంటే తెలంగాణ ప్రజలకు ఎక్కువగా ఛాన్స్ లు వచ్చే అవకాశం అయితే ఉంది.
ఆంధ్ర ఇండస్ట్రీ కనక ఏర్పడితే చాలామంది ప్రొడ్యూసర్ల కి అది అడ్వాంటేజ్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ కొన్ని స్టూడియోలను నిర్మించుకుంటున్నారు. దానివల్ల అక్కడ షూటింగ్స్ కి ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. ఇక వాళ్లకు రాబడి కూడా ఎక్కువగానే వస్తోంది.
వాళ్ళ భూములకు డిమాండ్ కూడా ఎక్కువగా పెరుగుతొంది. తద్వారా హైదరాబాద్ కంటే వైజాగ్ లో భూముల రేటు విపరీతంగా పెంచుకోవచ్చనే ఉద్దేశ్యంతో కొంతమంది ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రెండు ఇండస్ట్రీలు సపరేట్ అయి ఉంటే ఎక్కువ మందికి అవకాశాలు అయితే వస్తాయి. కానీ డివైడ్ అవ్వడం వల్ల రెండు ఇండస్ట్రీల మధ్య చీలికలు పెరిగి ఇండస్ట్రీ మొత్తానికి దెబ్బ ఎదురయ్యే సమస్యలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఇప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో భారీ క్రేజ్ ను సంపాదించుకుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ని బీట్ చేస్తూ మనవాళ్లు అద్భుతమైన సినిమాలను చేస్తూ ముందుకు కొనసాగుతున్న వేళ ఇండస్ట్రీ ని చీల్చడం అనేది కరెక్ట్ కాదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…