Sri Ramulayya: శ్రీ రాములయ్య ఓపెనింగ్ రోజు ఏం జరిగింది..? మోహన్ బాబు ప్రాణాల నుంచి ఎలా బయటపడ్డాడంటే..?

పరిటాల రవితో శత్రుత్వం ఉన్నవాళ్లే అలా చేశారనే వార్తలు అయితే వచ్చాయి. ఇక మొత్తానికైతే పరిటాల రవి వాళ్ళ నాన్న కథతో తెరకెక్కిన శ్రీరాములయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Written By: Gopi, Updated On : March 10, 2024 9:02 am

Sri Ramulayya

Follow us on

Sri Ramulayya: ఒకప్పుడు మోహన్ బాబు హీరోగా పలు రకాల సినిమాలు అయితే తెరకెక్కాయి. ఇక అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే, మరికొన్ని సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. ఇక ఇలాంటి సమయంలో మోహన్ బాబు తన స్నేహితుడు అయిన పరిటాల రవి వాళ్ల నాన్న జీవిత కథను సినిమాగా తెరకెక్కించాలనే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి ఎన్ శంకర్ ని డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. సినిమా ఓపెనింగ్ జరిగిన వెంటనే అక్కడ ఒక కార్ అయితే బ్లాస్ట్ అయింది. ఇక లక్కీగా అక్కడ ఎవరూ లేరు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది అయితే జరగలేదు. లేకపోతే మాత్రం మోహన్ బాబు కి చాలా ఇబ్బంది జరిగి ఉండేదని అప్పట్లో మీడియాలో చాలా కథనాలు కూడా వచ్చాయి. అయితే అప్పుడే అక్కడి నుంచి అందరూ పక్కకెళ్ళిపోవడంతో దానివల్ల ఎవరికి పెద్ద ప్రమాదం అయితే జరగలేదు.

అయితే పరిటాల రవితో శత్రుత్వం ఉన్నవాళ్లే అలా చేశారనే వార్తలు అయితే వచ్చాయి. ఇక మొత్తానికైతే పరిటాల రవి వాళ్ళ నాన్న కథతో తెరకెక్కిన శ్రీరాములయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత మోహన్ బాబు కూడా ఈ సినిమాతో మంచి హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆ తర్వాత యమజాతకుడు, రాయలసీమ రామన్న చౌదరి, పొలిటికల్ రౌడీ, పోస్ట్ మాన్ లాంటి సినిమాల్లో మోహన్ బాబు హీరోగా నటించాడు. అయినప్పటికీ ఈ సినిమాల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ గాని నిలిచాయి.

ఇక మొత్తానికైతే మోహన్ బాబు కెరీయర్ అనేది సాఫీగా సాగలేదని చెప్పాలి. దాంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి యమదొంగ, బుజ్జిగాడు లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు…ఇక ఇప్పుడు కూడా ఆయన కి అవకాశం వస్తే మళ్ళీ నటించడానికి మోహన్ బాబు రెఢీ గా ఉన్నాడు…