Chandra Mohan- Krishna Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన మార్క్ తో నటించి చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరించడం లో 100% సక్సెస్ అయిన నటులలో చంద్ర మోహన్ ఒకరు. అయితే ఈరోజు అనారోగ్య కారణం వల్ల ఆయన తన తుది శ్వాస విడిచారు. అందులో భాగంగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చేసిన క్యారెక్టర్ల గురించి కనక మనం తెలుసుకున్నట్లైతే ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలి నటనతో దూసుకుపోతున్న సందర్భంలో ఆయన క్యారెక్టర్ కి ఒక సెపరేట్ కామెడీ టచ్ ఇస్తు దర్శకుడు కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా సినిమాలో అద్భుతమైన ప్రయోగం చేశాడు. అందులో భాగంగానే కృష్ణవంశీ ఈ సినిమాలో తన క్యారెక్టర్ ని డిఫరెంట్ గా డిజైన్ చేశారు.
అయితే నిన్నే పెళ్ళాడుతా సినిమా స్క్రిప్ట్ పేపర్ మీద రాసిన క్యారెక్టర్ కి చంద్రమోహన్ గారు బిహేవ్ చేసే క్యారెక్టర్ కి మధ్య డిఫరెన్స్ ఉండడంతో కృష్ణవంశీ చంద్రమోహన్ గారిని కూర్చోబెట్టి ఆ క్యారెక్టర్ అలా చేయకూడదు అని చెప్పి చంద్ర మోహన్ గారితో చేయించాడు. అయిన కూడా ఆ క్యారెక్టర్ లో ఆయన చెప్పే డైలాగ్స్ లో జీవం లేకపోవడంతో ఆ రోజు షూట్ లో చంద్రమోహన్ ఎన్ని టేక్ లు చేసిన కృష్ణవంశీ కి నచ్చకపోవడంతో ఆరోజు చంద్రమోహన్ హర్ట్ అయి షూటింగ్ నుంచి వెళ్లి పోయారు.దాంతో కృష్ణ వంశీ ఆ రోజు షూట్ కి ప్యాకప్ చెప్పి నెక్స్ట్ డే చంద్ర మోహన్ గారికి క్లియర్ కట్ గా క్యారెక్టర్ చెప్పి ఆ క్యారెక్టర్ తాలూకు ఇంటెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో ఇక అప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది, ఎలా మాట్లాడుతుంది అని పరిపూర్ణ స్పష్టత చంద్రమోహన్ గారికి రావడం తో కృష్ణ వంశీ స్క్రిప్ట్ పేపర్లను పక్కనపెట్టి పర్టిక్యులర్ సీన్ ఏది అయితే ఉంటుంది దానికి తగ్గట్టుగా డైలాగులను అప్పటికప్పుడు చెప్పించి చంద్రమోహన్ చేత చేయించాడు.
దాంతో చంద్రమోహన్ కి కూడా ఆ క్యారెక్టర్ మీద గ్రిప్ దొరికింది అయితే ఫస్ట్ రోజు షూటింగ్ నుంచి వెళ్ళిపోయినందుకు రిగ్రెట్ అయిన చంద్ర మోహన్ కృష్ణవంశీ కి సారీ చెప్పారు…అప్పుడు కృష్ణవంశీ షూట్ లో అవన్నీ కామన్ సార్ అని చెప్పడం తో అప్పటి నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.. ఇక ఈ సినిమా షూటింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 1996 వ సంవత్సరంలో రిలీజ్ అయి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.ఇక దాంతో చంద్రమోహన్ గారు కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్నారు.
అప్పటి దాకా ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే తల్లిదండ్రుల పాత్రల్లో చేస్తూ పిల్లలకి మంచి మాటలు చెప్తూ ఉండే వారు కానీ ఈ సినిమాలో చంద్రమోహన్ గారి క్యారెక్టర్ దానికి భిన్నంగా ఉంటుంది. ఆయన ఫుల్ జోష్ లో ఉంటూనే పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండే క్యారెక్టర్ కావడం తో అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. మన ఇంట్లో కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే బాగుండేది కదా అని ప్రతి ప్రేక్షకుడు అనుకునెంతలా ఆ క్యారెక్టర్ తో చంద్ర మోహన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో చంద్రమోహన్ తనదైన మేటి సక్సెస్ ని సాధించాడు. ఇక అప్పటి నుంచి చంద్రమోహన్, కృష్ణవంశీ కాంబో లో చాలా సినిమాలు వచ్చాయి…