Chandra Mohan Assets: చంద్రమోహన్ చేసిన ఆ పని కారణంగా 100 కోట్లు నష్టం… ఆయన కోల్పోయిన విలువైన ఆస్తులు ఇవే!

పరిశ్రమలో తెలివైన నటుల్లో శోభన్ బాబు ఒకరు. ఆయనకు ఆర్థికపరమైన విషయాల మీద పట్టు ఉంది. డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలిసిన వ్యక్తి. ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ కోట్లు కుమ్మరిస్తుందని, భూముల పెట్టుబడి పెడితే భవిష్యత్తులో విపరీతమైన లాభాలు వస్తాయని నమ్మేవారు.

Written By: NARESH, Updated On : November 11, 2023 2:16 pm

Chandra Mohan

Follow us on

Chandra Mohan Assets నటుడు చంద్రమోహన్ నట ప్రస్థానం సుదీర్ఘకాలం సాగింది. ఐదు దశాబ్దాల పాటు ఆయన చిత్ర పరిశ్రమకు సేవలు చేశారు. హీరో, సపోర్టింగ్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నెగిటివ్ రోల్స్ చేశారు. హీరోగా చంద్రమోహన్ 170కి పైగా చేశారు. మొత్తంగా 900లకు పైగా చిత్రాల్లో నటించారు. చంద్రమోహన్ కి పరిశ్రమలో ఆల్ రౌండర్ అనే పేరుంది. ఇన్ని వందల చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ బాగానే సంపాదించారు. అయితే సంపాదించిన విలువైన ఆస్తులు నిలబెట్టుకోలేక పోయారు.

పరిశ్రమలో తెలివైన నటుల్లో శోభన్ బాబు ఒకరు. ఆయనకు ఆర్థికపరమైన విషయాల మీద పట్టు ఉంది. డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలిసిన వ్యక్తి. ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ కోట్లు కుమ్మరిస్తుందని, భూముల పెట్టుబడి పెడితే భవిష్యత్తులో విపరీతమైన లాభాలు వస్తాయని నమ్మేవారు. ఇదే విషయం తోటి నటులకు చెప్పేవారు. శోభన్ బాబు మాటలు విని చంద్రమోహన్ కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడట.

గొల్లపూడి మారుతీరావు కొంపల్లిలో 35 ఎకరాల ద్రాక్షతోట ఉంది దాన్ని కొనమని సలహా ఇచ్చాడట. ఆయన చెప్పినట్లే ఆ ద్రాక్ష తోట చంద్రమోహన్ కొన్నారట. కొన్నాళ్ల తర్వాత నిర్వహించడం కష్టమై అమ్మేశాడట. అలాగే చెన్నై నగర సమీపంలో 15 ఎకరాల భూమి ఉందట. అది కూడా అమ్మేశాడట. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 6 ఎకరాల నేల కొని మరలా అమ్మేశాడట. భూములు అమ్ముకోకు అని శోభన్ బాబు బ్రతిమిలాడినా చంద్రమోహన్ వినలేదట.

తక్కువ ధరకు అమ్మేసిన ఆ ఆస్తుల విలువ ఇప్పుడు కోట్లలో ఉంది. వంద కోట్లకు పైగా విలువైన ఆస్తి అమ్మి నాశనం చేసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ చెప్పాడు. చంద్రమోహన్ కి కొడుకులు లేరు. ఇద్దరూ కూతుళ్లే. ఒక అమ్మాయి డాక్టర్ కాగా అమెరికాలో సెటిల్ అయ్యింది. రెండో అమ్మాయి సైకాలజిస్ట్ అట. ఆమె చెన్నైలో స్థిరపడ్డారట. చంద్రమోహన్ భార్య జలంధర రచయిత కావడం విశేషం.