Subbaraju Marriage: సుబ్బరాజు నాటకీయంగా నటుడు అయ్యాడట. దర్శకుడు కృష్ణవంశీకి చెందిన పర్సనల్ కంప్యూటర్ రిపేర్ చేసేందుకు ఆయన ఆఫీస్ కి వెళ్ళాడట. మంచి హైట్, ఫిజిక్ తో కూడిన సుబ్బరాజుని చూసిన కృష్ణవంశీ ఖడ్గం మూవీలో చిన్న రోల్ ఆఫర్ చేశాడట. సుబ్బరాజు సరదాగా ఆ మూవీ చేశాడు. అనంతరం దర్శకుడు పూరి జగన్నాధ్ ఆయనకు బ్రేక్ ఇచ్చాడు. అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి చిత్రంలో కీలకమైన ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చాడు. నెగిటివ్ షేడ్స్ తో కూడిన ఈ పాత్రను చేసి సుబ్బరాజు మెప్పించాడు. దాంతో ఇండస్ట్రీలో విలన్ గా సెటిల్ అయ్యాడు.
ఆర్య, పోకిరి, దేశముదురు, అతిథి చిత్రాలతో సుబ్బరాజు మరింత పాప్యులర్ అయ్యాడు. కామెడీ విలన్ రోల్స్ కూడా సుబ్బరాజు చేయడం విశేషం. సుబ్బరాజు పలు ఇంటర్వ్యూలలో పెళ్లి పై స్పందించారు. పెళ్లి జీవితంలో తప్పనిసరి కాదు. వివాహం చేసుకోకపోయినా వచ్చిన నష్టం లేదు. నాకు పెద్దగా ఆసక్తి లేదన్నట్లు మాట్లాడారు. కట్ చేస్తే… 47 ఏళ్ల వయసులో సుబ్బరాజు వివాహం చేసుకున్నారు. సుబ్బరాజు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుబ్బరాజు ట్విట్టర్ లో.. మా కొత్త ప్రయాణం మొదలైంది. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు, అని ట్వీట్ చేశాడు భార్యతో ఉన్న ఫోటో షేర్ చేశారు. సుబ్బరాజు వివాహం యూఎస్ లో నిరాడంబరంగా జరిగింది. ఇక సుబ్బరాజు భార్య పేరు స్రవంతి అని సమాచారం. యూఎస్ లో గల ఫ్లోరిడా రాష్ట్రంలో ఆమె ఉంటారట. అక్కడే సెటిల్ అయ్యారు. ఇక వృత్తిరీత్యా స్రవంతి డాక్టర్. ఆమె డెంటిస్ట్ అని తెలుస్తుంది. స్రవంతి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఫ్యామిలీ మెంబర్స్ డిటైల్స్ తెలియవు.
వీరిది ప్రేమ వివాహమా? అరేంజ్డ్ నా? విషయంలో కూడా క్లారిటీ లేదు. లేటు వయసు మ్యారేజ్ కాబట్టి ఇది ప్రేమ పెళ్లి అని పలువురు నమ్ముతున్నారు. అందుకే నిరాడంబరంగా వివాహం జరిగిందని అంటున్నారు. ఇక సుబ్బరాజ్ కెరీర్ పరిశీలిస్తే.. ఇటీవల జితేందర్ రెడ్డి చిత్రంలో సుబ్బరాజు కనిపించాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆయనకు డిమాండ్ ఉంది.
Web Title: What does actor subbarajus wife do in the us who is sravanti what is the background interesting details
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com