Silk Smitha: సిల్క్ స్మిత గురించి చాలా మందికి తెలుసు. ఆమె శృంగార తారగా తెలుగులో ఓ వెలుగు వెలిగిన నటి. ఎనభయ్యో దశకంలో తన ప్రభావంతో చాలా సినిమాల్లో నటించి హీరోలకు సాయపడింది. సినిమాల విజయంలో కీలక పాత్ర వహించింది. ఆమె నటించిన బావబావమరిది చిత్రంలో బావలు సయ్యా పాట ఎంతటి ప్రాచుర్యం పొందిందో తెలిసిందే దీంతో ఆమె తన ప్రస్థానంలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలోనే సిల్క్ స్మిత జీవితం ఓ దీనగాథగానే మారింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై కూడా అనేక సందేహాలు వచ్చాయి. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కొందరి వాదన.
1979లో తెలుగులో ప్రవేశించిన ఆమె ఎనభై, తొంభయ్యో దకశకంలో తన హవా కొనసాగించింది. చాలా చిత్రాల్లో శృంగార పాటలకు ప్రత్యేకంగా ఆమె నటించి ప్రేక్షకులను మెప్పించింది. తన నటనతో అందరిని మంత్రముగ్దులను చేసింది. శృంగార పాత్రలకు పెట్టిందిపేరు. తన సొగసుతో రెచ్చగొట్టింది. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. సినిమాల విజయంలో తనదైన గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో నిర్మాతలు ఎక్కువగా సిల్క్ స్మిత మీదే ఆధారపడేవారంటే అతిశయోక్తి కాదని తెలిసిందే.
Also Read: YCP Plenary: వైసీపీ ప్లీనరీ నేటి నుంచే.. శాశ్వత అధ్యక్షుడు జగన్ యేనా?
1996 సెప్టెంబర్ 23న తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. దీనిపై భిన్న కథనాలు వినిపించాయి. ఆమె ప్రేమలో విఫలమైందని అందుకే ఆత్మహత్య చేసుకుందని కొందరు చెబితే మరికొందరు మాత్రం అది కారణం కాదని కొట్టిపారేశారు. మొత్తానికి ఆమె ఆత్మహత్య ఇప్పటికి కూడా మిస్టరీయే. దీంతో ఆమె పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంతో విరక్తితో ఆత్మహత్య చేసుకుందని ఇంకొందరు భావించారు. కానీ నిజమైన ఆధారాలు మాత్రం లభించలేదు. ఆమె మరణం మాత్రం సస్పెన్స్ గానే మారింది.
సిల్క్ స్మిత అందరు హీరోలతో నటించింది. అందరి విజయంలో సిల్క్ స్మిత ప్రముఖ పాత్ర పోషించింది. ఆమె చనిపోవడానికి కొద్దిరోజుల ముందు హీరో అర్జున్ తో మాత్రం తాను కొద్దిరోజుల్లో చనిపోతానని తనను చూడటానికి వస్తారా అని అడిగితే అర్జున్ ఆమెను మందలించినట్లు తెలిసిందే. ఎందుకలా మాట్లాడుతున్నావని చెప్పాడట. కానీ ఇలా చేస్తుందని మాత్రం అనుకోలేదు. అందుకే ఆమె చనిపోయాక అర్జున్ వెళ్లి చూశాడు. ప్రముఖులెవరు రాకముందే అర్జున్ వెళ్లి చూశాడట. తాను ఇలా చేసుకుంటుందని అనుకోలేదని అర్జున్ విచారం వ్యక్తం చేశాడు.
Also Read:Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ట్రంప్ లాంటి వాడేనా?