Naresh-Pavitra Lokesh Marriage Controversy: సీనియర్ నటుడు నరేష్ – పవిత్ర లోకేష్ ప్రేమ వ్యవహారం పై ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ గారు మళ్లీ ప్రేమలో పడటం, ఇక ఇద్దరు పిల్లలు ఉన్న పవిత్ర లోకేష్ గారు నరేష్ పై మనసు పారేసుకోవడం.. మొత్తానికి ఈ వార్త నిత్యం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.
దీనికితోడు నరేష్ – పవిత్ర ఒకే హోటల్ రూంలో ఉండగా… నరేష్ మూడవ భార్య రమ్య దాడి చేసి మరీ వారి గుట్టు ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పింది. ఈ సంఘటన తర్వాత వివరణ ఇస్తూ నరేష్ – పవిత్ర వేర్వేరుగా వీడియోలు పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోల్లో బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే. ఇది గమనించిన నెటిజన్లు ఇప్పుడు మరోసారి వీరిద్దరి పై ట్రోలింగ్ కి దిగారు.
Also Read: Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయిన తరువాత ఆ స్టార్ హీరో ఎందుకలా చేశాడు?
‘మీరిద్దరూ ఒకే రూంలో ఉండి.. ఏమి తెలియనట్టు ఇద్దరు వేర్వేరుగా వీడియోలు రిలీజ్ చేశారు, మిమ్మల్ని మేం నమ్మం’ అంటూ ట్రోలింగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. నరేష్ – పవిత్ర కూర్చున్న సోఫా కూడా ఒక్కటే అని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. దీంతో నరేష్, పవిత్ర మాట్లాడిన వీడియోల పై మీమ్స్ చేస్తూ ట్రోలర్స్ భయంకరంగా వీరిద్దర్నీ కామెడీ చేస్తున్నారు.
అయితే, నరేష్ వ్యవహారంతో పవిత్రా లోకేష్ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. పవిత్ర లోకేష్ తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు మదర్ గా నటిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు కాబట్టి.. ఆమెకు రెమ్యునరేషన్ కూడా రోజుకు లక్ష ముప్పై వేలు ఇచ్చేవారు. పైగా పెద్ద సినిమాల్లో తల్లి పాత్రలన్నీ ఆమె దగ్గరకే వెళ్ళేవి. ఆమెకు ఆ స్థాయిలో హోమ్లీ ఇమేజ్ ఉంది.
కానీ.. నరేష్ తో ఘాటు ప్రేమ వ్యవహారంతో పవిత్ర ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఇప్పటికే పవిత్రా లోకేష్ ను రెండు పెద్ద సినిమాల నుంచి తప్పించారు. ఒకటి కొరటాల – ఎన్టీఆర్ సినిమా కాగా, మరొకటి నాని సినిమా అని తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె చేత తల్లి పాత్రలు చేయించే ధైర్యం ఏ స్టార్ మేకర్ చేసేలా లేడు. మొత్తానికి నరేష్ తో ప్రేమ, పవిత్ర కెరీర్ పై బాగా ఎఫెక్ట్ చూపించింది.
Also Read:RRR Movie Mistakes: ఆర్ఆర్ఆర్ లో ఇప్పటికీ రాజమౌళిని వెంటాడుతోంది అదేనట?