The Rajasaab OTT: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్(Rebel Star Prabhas) ‘ది రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంత పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ, ప్రభాస్ కి ఉన్నటువంటి భారీ మార్కెట్ కారణంగా ఈ చిత్రానికి 180 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీసెంట్ గానే ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది. ఈ చిత్రానికి భారీ స్థాయిలో వ్యూస్ సొంతం అయ్యాయి. కానీ ఆడియన్స్ నుండి మాత్రం రెస్పాన్స్ మారలేదు. అసలు ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో ఇలాంటి చిల్లర సినిమా ఎలా తీసావు రా బాబు అంటూ అభిమానులు డైరెక్టర్ మారుతీ ని ట్యాగ్ చేసి తిడుతూనే ఉన్నారు. అయితే ప్రభాస్ వీరాభిమానులు ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్న జియో హాట్ స్టార్ మెయిన్ ఆఫీస్ కి ఇచ్చిన ఒక సర్ప్రైజ్ ఇప్పుడు ఇంస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా ఓటీటీ లో విడుదలైన సందర్భంగా ప్రభాస్ అభిమానులు జియో హాట్ స్టార్(Jio Hotstar) కార్యాలయానికి పెద్ద ఎత్తున బిర్యానీలు పంపడం సంచలనం గా మారింది. దీనిపై జియో హాట్ స్టార్ ఫన్నీ వే లో రెస్పాన్స్ ఇస్తూ కామెంట్స్ ఒక పోస్ట్ పెట్టారు. దీనిని చూసిన నెటిజెన్స్, ఇదేమి అభిమానం రా బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అనుభవం గతం లో ఏ ఓటీటీ సంస్థకు కూడా ఎదురు అవ్వలేదు. ప్రభాస్ ఈ విధంగా సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ప్రభాస్ కి తన ఇంటికి వచ్చిన వాళ్లకు కానీ, షూటింగ్ లొకేషన్ లో ఉన్న వాళ్లకు కానీ, పొట్ట పగిలికిపోయేలా భోజనం చేయించి పంపుతూ ఉంటాడు. ఈ గొప్ప లక్షణాన్ని అభిమానులు కూడా అలవాటు చేసుకున్నారు అనే విషయం అర్థం అవుతోంది.
ఇకపోతే ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఆయన లైనప్ లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ‘స్పిరిట్’ చిత్రాన్ని రీసెంట్ గానే మొదలు పెట్టిన ప్రభాస్, ఆ సినిమాకు సంబంధించిన 5 రోజుల షెడ్యూల్ లో పాల్గొన్నాడు. త్వరలోనే డెహ్రాడూన్ లో 15 రోజుల షెడ్యూల్ ఒకటి మొదలు కానుంది. అదే విధంగా ‘కల్కి 2 ‘ చిత్రానికి కూడా ఆయన డేట్స్ కేటాయించాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ పూర్తి అయ్యాక, ఆయన హను రాఘవపూడి తో చేస్తున్న ‘ఫౌజీ’ మూవీ కి పూర్తి స్థాయిలో డేట్స్ ని కేటాయించబోతున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
