https://oktelugu.com/

Mangalavaaram: మంగళవారం సినిమా చూశాక పాయల్ రాజ్ పుత్ పేరెంట్స్ చెప్పిన మాట ఏంటంటే..?

దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాయల్ రాజ్ పుత్ గురించి మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ ని తను చేస్తానని ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అని, అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఘట్స్ ఉండాలని చెప్పాడు.

Written By:
  • Gopi
  • , Updated On : November 23, 2023 / 06:09 PM IST

    Mangalavaaram

    Follow us on

    Mangalavaaram: అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో వచ్చిన మంగళవారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో చేసినందుకు గాను ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి మంచి గుర్తింపు లభించింది.ఇక రీసెంట్ గా ఈ మూవీ టీమ్ సక్సెస్ మీట్ ని కూడా ఘనంగా నిర్వహించారు.

    అయితే ముఖ్యంగా ఈ సినిమాలో లేడీస్ కి సంబంధించిన ఒక రకమైన అంశాన్ని సెంటర్ పాయింట్ గా చేసుకొని చేసిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా విపరీతంగా అలరించింది. ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే అజయ్ భూపతి డైరెక్షన్ అనే చెప్పాలి.ఇక దాంతోపాటుగా పాయల్ రాజ్ పుత్ యాక్టింగ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా చూసిన పాయల్ రాజ్ పుత్ వాళ్ళ పేరెంట్స్ తనని పొగుడుతూ చాలా బాగా యాక్టింగ్ చేశావు. నటి గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది అంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది.

    అయితే దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాయల్ రాజ్ పుత్ గురించి మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ ని తను చేస్తానని ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అని, అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఘట్స్ ఉండాలని చెప్పాడు. ఇక అలాగే పాయల్ రాజ్ పుత్ పేరెంట్స్ కూడా రీసెంట్ గా ఆమెకి తన నటన గురించి చెప్తూ చాలా బాగా చేశావ్ అంటూ తన ప్లస్ లు, మైనస్ లు చెప్పారట.ఇక పేరెంట్స్ ఇలాంటి సినిమా చూసినప్పుడు కొంచెం గిల్టీ గా ఫీల్ అవుతారు. కానీ పాయల్ రాజ్ పుత్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం అలా అవ్వకుండా నటి అన్నప్పుడు అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలి కాబట్టి అలాంటి క్యారెక్టర్లు చేయడంలో తప్పులేదు అన్నట్టుగా తనకు మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టుగా తను ఒక ఇంటర్వ్యూ లో అయితే చెప్పింది.

    ఇక నిజానికి ఈ క్యారెక్టర్ కోసం తెలుగులో ఉన్న కొంతమంది హీరోయిన్లను అజయ్ భూపతి సంప్రదించినప్పటికీ కథ విన్న తర్వాత ఈ సినిమా చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ పాయల్ మాత్రం ఈ కథ విన్న వెంటనే ఏమి ఆలోచించకుండా తనకి నటి గా మంచి పేరు అయితే వస్తుందని తను ఈ సినిమాలో నటించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తనకి మంచి క్రేజ్ తో పాటు గా, నటి గా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది.ఇక ఇలాంటి సందర్భంలో కథ నచ్చితే ఎలాంటి సినిమాలు చేయడానికి తను ఎప్పుడు ముందు ఉంటానని సక్సెస్ మీట్ లో కూడా ఆమె తెలియజేసింది…