Inear : రియాల్టీ షోలలో యాంకర్స్ ఇన్ ఇయర్ ఎందుకు పెట్టుకుంటారు…దాని వెనక దాగివున్న సీక్రెట్స్ ఏంటంటే..?

ఇండస్ట్రీ అంటేనే మాయ...అక్కడ ఏం జరుగుతుంది ఇలా జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలీదు...ప్రేక్షకులు కేవలం స్క్రీన్ మీద కనిపించే వాళ్ళను మాత్రమే చూస్తుంటారు...

Written By: Gopi, Updated On : September 15, 2024 9:33 pm

Inear

Follow us on

Inear :  బుల్లితెర మీద వచ్చిన షోలు దాదాపు సక్సెస్ ఫుల్ గా నిలుస్తూ ఉంటాయి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఏ రకంగా ఆదరిస్తూ ఉంటారో టెలివిజన్ లో వచ్చే సీరియల్స్ గాని, షోలను గాని అదే రీతిలో ఆదరిస్తూ ఉంటారు. ఇక ఈ షోలలో యాంకర్స్ చాలా అనర్గళంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. ఇక మధ్యమధ్యలో కొందరు కంటెస్టెంట్స్ మీద కామెడీలు చేయడం, జడ్జ్ లను ఇమిటేట్ చేయడం లాంటివి చేసి ప్రేక్షకులను ఛానెల్ మార్చకుండా చేస్తారు. దాని ద్వారా ఎక్కువ టీఅర్పి రేటింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో ఆ షో గురించి ఒక బలమైన ముద్ర వేస్తారు… నిజానికి ఆ షో ను చూస్తున్న ప్రేక్షకులందరూ ఆ యాంకరే అక్కడక్కడే స్పాంటేనేట్ గా మాటలు మాట్లాడుతుంది. ఇతరుల మీద పంచులు వేస్తుంది. ఆమె చాలా టాలెంటెడ్ అని అనుకుంటారు. కానీ అక్కడ జరిగే సిచువేషన్ మొత్తాన్ని ముందే ఆ షో రైటర్ క్రియేట్ చేసి డైలాగ్స్ కూడా రాసి పెట్టుకుంటాడు. దానివల్ల షో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా రావడమే కాకుండా యాంకర్స్ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా వాళ్ళే డిజైన్ చేయడం వల్ల యాంకర్ కి ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. ఒక షో ను దర్శకుడు, రైటర్ ఇద్దరు కలిసి డిజైన్ చేసి ఆ షో కు సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను సమకూరుస్తారు.

ఇక దానికి తగ్గట్టుగానే అక్కడ జరిగే సిచువేషన్ మొత్తాన్ని ముందే యాంకర్ కి వివరిస్తారు.అయితే ఒక షో లో యాంకర్స్ ఎలా మాట్లాడుతారు అంటే… ఒక షో షూటింగ్ జరిగే దగ్గర్లోనే ‘పిసిఆర్ ‘ అనే ఒక రూమ్ ఉంటుంది. పిసిఆర్ అంటే ‘ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్’… దీంట్లో ఒక మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్ కి కెమెరాలు కనెక్ట్ అయి ఉంటాయి. రైటర్ ఆ మానిటర్ లో కూర్చొని తన ఎదురుగా ఉన్న మైక్ ద్వారా యాంకర్ పెట్టుకున్న ‘ఇన్ ఇయర్’ కి ఇక్కడి నుంచి డైలాగులను అందిస్తే స్టేజ్ మీద ఉన్న యాంకర్ కెమెరా ముందు ఆ మాటలను చెబుతూ ఉంటాడు.

ఇక వాళ్ళు ఏది చేసినా కూడా మొత్తం ముందే ప్రీ ప్లాన్డ్ గా స్క్రిప్ట్ ప్రకారం రాసుకుంటారు. కాబట్టి ఏ యాంకరు ఏ షోలో కూడా స్పాంటినేట్ గా డైలాగులు అయితే చెప్పలేడు. ఒకవేళ అప్పటికప్పుడు ఒకటి అర సించువేశన్స్ ను బట్టి చెబుతారు తప్ప 99% మొత్తం రియాల్టీ షో లన్ని స్క్రిప్ట్ బేస్డ్ గానే నడుస్తుంటాయి… టెలివిజన్ లో వస్తున్న ప్రతి రియాల్టీ షో పరిస్థితి ఇదే…

యాంకర్ ఇన్ ఇయర్ వెనక ఒక రైటర్ ఉంటడనే విషయం మనలో చాలామందికి తెలియదు.కేవలం యాంకర్లు చెప్పే మాటలే మనకు వినిపిస్తాయి తప్ప తెర వెనక దాన్ని క్రియేట్ చేసిన వాళ్లు మాత్రం మనకు ఎప్పటికీ కనిపించరు…ఇన్ ఇయర్ నుంచి రైటర్లు డైలాగ్స్ అందించకపోతే తెలుగు రాని యాంకర్లు కూడా ఇక్కడ స్టార్ యాంకర్లు గా ఎలా మారుతారు అనేది ఆలోచిస్తే మైక్ అర్థం అవుతుంది…