https://oktelugu.com/

Nithin: నితిన్ కి ఆ ప్లాప్ సినిమా నచ్చడానికి గల కారణాలు ఏంటంటే..?

వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఆయన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్ లో నితిన్ చాలా బిజీగా తిరుగుతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2023 / 01:37 PM IST
    Follow us on

    Nithin: తెలుగులో ఉన్న యంగ్ హీరోల అందరిలో ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకొని సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న హీరో నితిన్…ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఒక 5 సంవత్సరాల పాటు ఆయనకి ఒక్క హిట్టు కూడా లేకుండా 14 ఫ్లాప్ సినిమాలు ఆయన ఖాతాలో పడ్డాయి. వరుసగా అన్ని ఫ్లాప్ సినిమాలు రావడం అనేది మామూలు విషయం కాదు ఇక ఇలాంటి సమయంలో నితిన్ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతాడు అనుకున్న సందర్భంలో ఇష్క్ సినిమా రూపంలో ఆయనకి మరొక అద్భుతమైన విజయం అనేది దక్కింది. దాంతో ఆయన ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొని మళ్లీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు.

    ఇక ఇప్పుడు వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఆయన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్ లో నితిన్ చాలా బిజీగా తిరుగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన అప్పుడెప్పుడో చేసిన తన ఫ్లాప్ సినిమా అయిన శ్రీ ఆంజనేయం అనే సినిమా గురించి ప్రస్తావిస్తూ నా సినిమాల్లో నాకు చాలా ఇష్టమైన సినిమా శ్రీ ఆంజనేయం సినిమా అంటూ చెప్పాడు.

    ఆ సినిమా ఇప్పుడు చూసిన కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందని చెప్పాడు.ఇక ఒకటి, రెండు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆ మిస్టేక్స్ ని తీసేసి ఇప్పుడున్న కొత్త టెక్నాలజీని ఆడ్ చేసి ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆ సినిమాలో ఒక అమాయకపు అబ్బాయి గా నితిన్ నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

    ఇక ఆ క్యారెక్టర్ గురించి నితిన్ మాట్లాడుతూ అలాంటి క్యారెక్టర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూనే డైరెక్టర్ కృష్ణవంశీ శ్రీ ఆంజనేయం సినిమాలో ఆ క్యారెక్టర్ నాకివ్వడం నా అదృష్టం అంటూ చెప్పాడు. ఇక డిసెంబర్ 8వ తేదీన వస్తున్న ఈ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా మీదనే నితిన్ మంచి అంచనాలు పెట్టుకున్నాడు…ఈ సినిమా సక్సెస్ అయితే మళ్ళీ నితిన్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడు…