Vettayan : రజినీకాంత్ వేట్టయన్ లో ఇదే హైలెట్ అవ్వనుందా..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం. ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కూడా సక్సెస్ లేకపోతే మాత్రం ఢీలా పడిపోవాల్సిందే. దాని ద్వారా ఆయన మార్కెట్ కూడా భారీగా తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు హీరోలు తమను తాము ప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులకు చాలా కొత్త సినిమాలను అందించే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది...

Written By: NARESH, Updated On : October 8, 2024 4:01 pm

Vettayan

Follow us on

Vettayan : తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటుడు రజనీకాంత్… ఆయన తమిళ్, తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటు ఒక ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆయన చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమాలో తనను తాను రిప్రజెంట్ చేసుకుంటూ ఒక హై యాక్షన్ ఎపిసోడ్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. రజనీకాంత్ స్టైల్ తోనే జనాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా డాన్స్ లు చేయాల్సిన పని కూడా లేదని చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి ఆయన ఎక్కువగా డాన్సులు చేయకపోయిన కూడా మొదటి నుంచి తన స్టైల్ తోనే నెట్టుకు వస్తున్నాడు. ఇక ఇప్పుడు 70 సంవత్సరాలకు పైన వయసు ఉన్నప్పటికి కూడా ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటున్నాయి అంటే ఆయన ఏ రేంజ్ లో కష్టపడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే దసరా కానుకగా ఆయన హీరోగా చేసిన వేట్టయన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. జ్ఞానవెల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చాలామంది ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ మాత్రం హైలెట్ గా నిలవబోతుందని చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారు.

దానికి గల కారణం ఏంటి అంటే క్లైమాక్స్ లో రజనీకాంత్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా మొత్తం ఒక మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ కేస్ ని రజనీకాంత్ ఎలా సాల్వ్ చేశాడు. తన ఇంటలిజెన్స్ ఎలా వాడాడు అనేదాన్ని హైలైట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది.

కాబట్టి క్లైమాక్స్ లో కొన్ని ట్విస్ట్ లతో ఉంటూనే రజనీకాంత్ లోని నట ప్రతిభను కనిపిస్తుంది. అలాగే రజినీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా అద్భుతంగా ఉంటుందని సినిమా మేకర్స్ అయితే ఈ సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది…