Tollywood : కొంత మంది నటీనటులు మరణాలు మిస్టీరియస్ గా ఉంటాయి. ఇప్పటికీ కొన్ని మరణాల వెనుక నిజానిజాలు తెలియవు. అసలు ఆ మరణాల వెనుక కారణం ఎవరు? వారు ఎందుకు మరణించారు అనే అనుమానాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన ప్రముఖుల జాబితా చాలా పెద్దదనే చెప్పాలి. అభిమాన సినీ నటులు కొందరు అసాధారణమైన పరిస్థితులలో మరణించిన విషయం తెలిసిందే.దీంతో ఎంతో మందికి అనుమానాలు వచ్చాయి. అలా ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీ మరణాల గురించి తెలుసుకుందాం..
ఉదయ్ కిరణ్
కెరీర్ ప్రారంభంలోనే విజయాల పరంపర సాగించిన అతికొద్ది మంది నటుల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. 2001లో తేజ దర్శకత్వం వహించిన `చిత్రం` సినిమాతో ఆయన రంగప్రవేశం చేశారు. చిత్రమ్‌లో తన నటనకు గానూ నంది అవార్డును గెలుచుకున్నాడు. మనసంతా నువ్వే, నువ్వు నేను, తొలి ప్రేమ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు ఉదయ్ కిరణ్. తమిళం, కన్నడ చిత్రాలలో కూడా కనిపించాడు. ఉదయ్ కిరణ్ 2014లో ఆత్మహత్యతో చేసుకొని మరణించాడు. అయితే చిత్ర పరిశ్రమలో ఫెయిల్యూర్ కారణంగానే డిప్రెషన్‌కు లోనయ్యాడని సమాచారం. అంతేకాదు ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడని కూడా టాక్ వచ్చింది.మళ్లీ కెరీర్ ను ప్రారంభించడానికి కూడా చాలా కష్టపడ్డాడట. అయినా ఫలితం లేకపోయింది. ఇలా మానసిక వేదనకు లోనై.. 2014 జనవరి 5న హైదరాబాద్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ,ఆయన మరణానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియరాలేదు.
సిల్క్ స్మిత
సిల్క్ స్మిత చలనచిత్రాలలో బోల్డ్, గ్లామరస్ పాత్రలు పోషించడంలో పేరు పొందింది. అయితే 1980, 1990 లలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో ఒకరిగా నిలిచింది. తన కెరీర్‌లో 450కి పైగా చిత్రాలలో నటించింది. అంతేకాదు గ్లామర్ పాత్రల నుంచి విలన్ పాత్రల వరకు ఏదైనా పాత్ర పోషించడంలో దిట్ట అని టాక్ వచ్చింది కూడా..అయితే సిల్క్ స్మిత మరణానికి గల కారణాలు కూడా తెలియడం లేదు. ఆమె మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు అస్పష్టంగా ఉన్నాయి. ఆమె సెప్టెంబరు 23, 1996న చెన్నై అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే కొన్ని నివేదికలు ప్రకారం ఆమె ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూచిస్తున్నాయి. అంతేకాదు ఆమెను హత్య చేసారని కూడా పుకార్లు షికార్లు కొట్టాయి. కానీ ఇది అధికారికంగా ధృవీకరించలేదు. దీంతో సిల్క్ స్మిత మరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది.
దివ్య భారతి
దివ్య భారతి సహజమైన అందంతో నటనా సామర్థ్యంతో ప్రేక్షకులను అలరించడంలో ముందుండేది. గ్లామర్ పాత్రలకు తావిచ్చేది కాదు భారతి. 1990లో విడుదలైన బొబ్బిలి రాజా సినిమాతో.. కెరీర్‌ను ప్రారంభించింది. అప్పుడు ఆమెకు 16సంవత్సరాలు. భారతి అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మ క్షేత్రం, చిట్టెమ్మ మొగుడు వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంది. ఇక ఈ నటి చివరి చిత్రం 1993లో `తొలి ముద్దు`లో నటించింది. భారతి 1992లో నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలాను వివాహం చేసుకుంది. ఆమె 19 సంవత్సరాల వయస్సులోనే.. ఏప్రిల్ 1993లో తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి పడిపోయి మరణించింది. అయితే అలా పైనుంచి ఎలా పడింది. ఎందుకు పడింది అనే అనుమానాలు ఇప్పటికీ చాలా మందిలో మెదులుతూనే ఉంటాయి.దీంతో భారతి మృతి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది.
శ్రీదేవి
అతిలోక సుందరి శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా చిత్రపరిశ్రమను ఏలింది. ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేది. ఈ స్టార్ నటి శ్రీదేవి కూడా ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని తన హోటల్ గదిలో శవమై కనిపించింది. దీంతో ఆమె మరణం కూడా మిస్టరీగానే మిగిలింది. అయితే బాత్ టబ్ లో ప్రమాదవ శాత్తు పడిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ శ్రీదేవి గుండెపోటుతో మరణించిందని డాక్టర్లు దృవీకరించారు. కానీ ఇలా సడన్ గా గుండె పోటు ఎందుకు వచ్చింది అనే కారణాలు ఇప్పటికీ తెలిసిరాలేదు. అయితే కొన్ని విషయాలు ఎవరికీ తెలియకుండానే కాల గర్భంలో కలిసిపోతాయనడంలో సందేహం లేదు. మరి వీరి మరణాలు నిజంగానే మిస్టరీలో.. లేదా ఆత్మహత్యలు, సహజమరణాలో తెలియదు. కొన్నింటికి సమాధానాలు ఇక లభించవని నెటిజన్లు చెబుతున్నారు.