https://oktelugu.com/

Surya: సూర్య కార్తీక్ సుబ్బరాజు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయడానికి సూర్య ఆసక్తి చూపిస్తూ వస్తున్నాడు. ఇక తన ఎంటైర్ కెరియర్ లో చేసిన గజిని, 24, సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలు ఆయనలోని నటుడిని బయటికి తీయడమే కాకుండా సినిమాల పట్ల ఆయనకున్న ప్యాషన్ ని కూడా ప్రేక్షకులకు తెలిసేలా చేస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 8, 2024 / 03:54 PM IST

    Surya(1)

    Follow us on

    Surya: సినిమా ఇండస్ట్రీలో సూర్యకి చాలా ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. ఇక తెలుగులో కూడా ఆయన సినిమాలను చూడడానికి చాలామంది జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా ప్రతి ఒక్కరితో విజిల్స్ వేయించేలా ఆయన సినిమాలో సీన్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకునే సినిమాలను చేయడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. సినిమాలు కథల మీద ఆయన తీసుకునే శ్రద్ధ అంత ఇంత కాదు. ఇక ప్రస్తుతం ఆయన శివ డైరెక్షన్ లో చేస్తున్న కంగువ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈ సందర్భంలో వాళ్ళు చేస్తున్న సినిమాలే కాకుండా ఆయన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరొక సినిమాకి కూడా కమిట్ అయ్యాడు. ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక కార్తీక్ సుబ్బరాజ్ అనగానే మనకు వైవిధ్యమైన కథాంశాలైతే గుర్తుకొస్తూ ఉంటాయి. జిగర్తాండ లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్టును తెరకెక్కించడంలో ఆయనకి చాలా మంచి పేరైతే ఉంది. మరి అలాంటి క్రమంలోనే ఈ సినిమా మాత్రం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    మొత్తానికైతే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
    ఇక ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా అలాంటి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇవ్వలేదట. అలాంటి ఒక డిఫరెంట్ బ్యాంగ్ తో ఈ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక ప్రస్తుతం కంగువ సినిమాతో సూర్య పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగితే ఆయన మార్కెట్ అనేది విపరీతంగా పెరగడమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచే అవకాశాలైతే ఉన్నాయి. మరి కంగువ అలాగే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్న సినిమాలపైనే సూర్య భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన కెరియర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందనే చెప్పాలి…