Sandeep Reddy Vanga Movies: ఒక హీరో కి ఒక మూవీతో గుర్తింపు వచ్చిందంటే చాలు అతను ఆ జానర్ లోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతాడు. దాని వల్ల ఆయన ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే దగ్గరవుతాడు. ఇక హీరోలను అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేయడానికి చాలా మంది డైరెక్టర్లు మంచి కథలతో సినిమాలు చేస్తుంటారు. హీరోలను ఎలివేట్ చేయాలంటే అది డైరెక్టర్ల చేతిలో మాత్రమే ఉంటుందనేది వాస్తవం… ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా సందీప్ రెడ్డివంగా చేసిన సినిమాలకైతే గొప్ప గుర్తింపు వస్తోంది. ఆయన హీరోలను చాలా అగ్రెసివ్ గా చూపిస్తాడు. అలాగే ఎమోషన్స్ ను సైతం చాలా వరకు కట్టిపడేసేలా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్రతి విషయాన్ని ప్రేక్షకులను గుచ్చుకునేలా చేస్తూ ఉంటాడు. కాబట్టి అతని సినిమాలకు గొప్ప గుర్తింపైతే వస్తోంది… సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటించే హీరోలకు కలిగే లాభాలు ఏమిటి అంటూ ఒక ప్రశ్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అతని సినిమాల్లో నటిస్తే హీరో తాలూకు యాక్టివిటీస్ పెడుగుతూ ఉంటాయి. ఉదాహరణకి అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను మనం చూసుకుంటే అతను చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. తన క్యారెక్టర్ కూడా చాలా హై లెవెల్లో చిత్రీకరించాడు. కాబట్టి విజయ్ ఎక్కువగా ఎలివేట్ అయ్యాడు…
కాబట్టి వాళ్లకు మాస్ లో మంచి ఫాలోయింగ్ వస్తోంది. అలాగే ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. అనిమల్ సినిమాతో ఆర్బీర్ కపూర్ సైతం మాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు… అందుకే సందీప్ రెడ్డి వంగ సినిమాలో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు…ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక వచ్చే నెల నుంచి సెట్స్ మీదకి వెళ్తున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సందీప్ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ను వసూలు చేస్తోందనేది తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…