https://oktelugu.com/

Pellam Urelithe Movie : సునీల్ పక్కన నటించిన ఈమె ఎవరో తెలుసా? ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

కొంతమంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేక సీరియల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవకాశం వచ్చినా నటించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ప్రశాంతి అప్పటికీ, ఇప్పటికీ చాలా మారిపోయారు. తనకు సినిమాలంటే చాలా ఇష్టమని, అయితే సరైన అవకాశాలు లేక స్టార్ ను కాలేకపోయానని తెలిపింది. మరోసారి సినిమాల్లో నటించి తన ప్రతిభ నిరూపించుకుంటానని చెబుతున్నారు. మరి ప్రశాంతికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2024 / 01:53 PM IST

    Suneel Pellam Urelithe

    Follow us on

    Pellam Urelithe Movie : సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరూ ఏదో ఒక గోల్ తో వస్తారు. కానీ చాలా మంది అలా అనుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుతో సరిపెట్టుకున్నారు. అయితే వివిధ పాత్రల్లో నటించిన వారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా సినిమాల్లో కనిపించిన కొన్నాళ్ల తరువాత ఇండస్ట్రీకి దూరమైపోయారు. అయితే ఈమధ్య ఎక్కువగా చాలా మంది పాత నటులు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. సీరియల్స్, యూట్యూబ్ ఛానెళ్లలో కనిపిస్తూ అలరిస్తున్నారు. అలా కొన్ని ఓ నటి చాన్నాళ్ల తరువాత మీడియా ముందుకు వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

    పెళ్లాం ఊరెళితె సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండి పోతుంది. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ మూవీలో ఇద్దరు హీరోలతో పాటు సునీల్ కూడా నటించారు. సునీల్ భార్యగా ఒకామె నటించింది. ఈమె చాలా అమాయకురాలి పాత్రలో కనిపిస్తుంది. అయితే ఈమె అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో తన మేనల్లుడి లవర్ పాత్రలో కనిపించింది. ఇలా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలోకి రాబోతున్నారు.

    ఆమె ఎవరో కాదు ప్రశాంతి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన ప్రశాంతి ఆ తరువాత పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని అమెరికాకు వెళ్లిపోయారు. చాన్నాళ్ల తరువాత ఆమె ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరోసారి అవకాశం వస్తే సినిమాల్లో కనిపిస్తానని అంటున్నారు. పెళ్లయిన తరువాత అమెరికాకు వెళ్లినా తన మనసంతా సినిమాలపైనే ఉందని, ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటూ సినిమాల్లో కనిపిస్తానని అంటున్నారు.