తెలుగులో వెబ్ సిరీస్ లు వర్కవుట్ కావా?

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. హిందీ డిజిటల్ కంటెంట్ మేకర్స్ ను చూసి తెలుగు డిజిటల్ కంటెంట్ మేకర్స్ వాత పెట్టుకుంటున్నారు. హిందీ కంటెంట్ కి ప్రేక్షకులు ఎక్కువ, పైగా మార్కెట్ కూడా ఎక్కువ. అందుకే, హిందీలో వస్తోన్న వెబ్ సిరీస్‌ లను క్వాలిటీ పరంగా సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తీస్తారు. ఈ క్రమంలోనే అక్కడ ‘ది ఫ్యామిలీ మ్యాన్, స్పెషల్ ఆప్స్’ లాంటి భారీ వెబ్ సిరీస్‌ లు వచ్చాయి. భారీ […]

Written By: admin, Updated On : April 25, 2021 1:47 pm
Follow us on

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. హిందీ డిజిటల్ కంటెంట్ మేకర్స్ ను చూసి తెలుగు డిజిటల్ కంటెంట్ మేకర్స్ వాత పెట్టుకుంటున్నారు. హిందీ కంటెంట్ కి ప్రేక్షకులు ఎక్కువ, పైగా మార్కెట్ కూడా ఎక్కువ. అందుకే, హిందీలో వస్తోన్న వెబ్ సిరీస్‌ లను క్వాలిటీ పరంగా సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తీస్తారు. ఈ క్రమంలోనే అక్కడ ‘ది ఫ్యామిలీ మ్యాన్, స్పెషల్ ఆప్స్’ లాంటి భారీ వెబ్ సిరీస్‌ లు వచ్చాయి. భారీ బడ్జెట్‌ తో ఆ వెబ్ కంటెంట్ ను తీశారు. ఇంకా తీస్తున్నారు.

అయితే, ఆ కంటెంట్ ను చూస్తూ తెలుగులో కూడా అచ్చంగా అలాంటి వెబ్ కంటెంట్ నే తీయాలని తెలుగు వెబ్ మేకర్స్ తెగ ఉత్సాహ పడుతున్నారు. ఆ ఉత్సాహంలో బడ్జెట్ విషయంలో బోర్డర్స్ దాటేస్తున్నారు. ఎలాగూ ఓటిటికి క్రేజ్‌ పెరిగింది కాబట్టి, ఖర్చు పెట్టి తెలుగులో కూడా వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ లు చేయాలని దర్శకనిర్మాతలు సంకల్పిస్తూ.. మొత్తానికి హిందీ కంటెంట్ కి పోటీగా తెలుగు వెబ్ కంటెంట్ ను తీస్తున్నారు. హిందీ స్థాయి క్వాలిటీ రావాలని గోల్ పెట్టుకోవడం వల్ల తెలుగులో కూడా భారీ బడ్జెట్ పెట్టక తప్పడంలేదు.

కానీ తీరా భారీగా ఖర్చు పెట్టి, అదనపు పెట్టుబడి పెట్టి వెబ్ సిరీస్ లు, వెబ్ మూవీస్ తీస్తే.. కనీసం వాటిని కొనేవాడు లేక, చివరకు డిజిటల్ మేకర్స్ కి బాధే మిగులుతుంది. కాబట్టి భారీగా ఖర్చు పెడితే లాభాల సంగతి అటుంచి, పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడమే గగనమైపోతుందనే విషయాన్నీ వర్ధమాన వెబ్ మేకర్స్ అర్ధం చేసుకోవాలి. ఆల్ రెడీ వెబ్ లోకంలో సర్వస్వం పోగొట్టుకున్న బ్యాచ్ ను ఈ విషయాలను అడిగితే చాల బాగా చెబుతారు. ముఖ్యంగా హిందీ సిరీస్‌లకు దేశమంతటా ఆడియన్స్ వుంటారు. వాటికి వున్న రీచ్ వల్ల అంత ఖర్చు పెట్టినా హిందీ సిరీస్ లకు వర్కౌట్ అవుతుంది.

అదే తెలుగు సిరీస్ లకు ఇది ఏ మాత్రం వర్కౌట్ అవ్వదు, చివరకు నష్టపోవాల్సి వస్తోంది.. కాబట్టి రీజనల్ వెబ్ సిరీస్‌లకు రీచ్ చాలా తక్కువ అనే విషయాన్ని వెబ్ మేకర్స్ తెలుసుకుని తమ కంటెంట్ ను ప్లాన్ చేసుకుంటే మంచింది. ప్రస్తుత టైమ్‌లో సినిమాలకు మళ్ళీ గ్యాప్ వచ్చింది, దాంతో పలువురు నిర్మాతలు, దర్శకులు మళ్ళీ వెబ్ సిరీస్‌ల పట్ల అమితాసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు తమ ఆసక్తిని బట్టి కాకుండా.. లెక్కలు చూసుకుని మార్కెట్ కి తగ్గట్టుగా తెలుగు కంటెంట్‌ పై ఖర్చు పెడితే బాగుంటుంది. ఎందుకంటే వచ్చేది తక్కువ పెట్టేది ఎక్కువ. సో.. వెబ్ మేకర్స్ జరభద్రం.