YS Jagan: ‘వైఎస్ జగన్ ను లేపేస్తాం’.. ఖండించిన జనసేన.. వైరల్..!

YS Jagan: ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశం రోజుకో కొత్త వివాదాన్ని సృష్టిస్తోంది. కొద్దిరోజులుగా ఏపీలో జగన్ సర్కార్ వర్సెస్ సినీ ఇండస్ట్రీ మధ్య వార్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి సమయంలోనే ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మెగా స్టార్ చిరంజీవి ఇటీవల రంగంలోకి దిగారు. నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్ తో లంచ్ చేశారు. అనంతరం సినీ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను చిరంజీవి సీఎం జగన్ కు […]

Written By: Raghava Rao Gara, Updated On : January 17, 2022 3:44 pm
Follow us on

YS Jagan: ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశం రోజుకో కొత్త వివాదాన్ని సృష్టిస్తోంది. కొద్దిరోజులుగా ఏపీలో జగన్ సర్కార్ వర్సెస్ సినీ ఇండస్ట్రీ మధ్య వార్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి సమయంలోనే ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మెగా స్టార్ చిరంజీవి ఇటీవల రంగంలోకి దిగారు. నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్ తో లంచ్ చేశారు.

CM Jagan

అనంతరం సినీ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను చిరంజీవి సీఎం జగన్ కు వివరించారు. దీనిపై ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు చిరంజీవి మీడియా ముఖంగా తెలిపారు. ఇదే సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచనలు చేశారు.

దీంతో త్వరలోనే సినీ టికెట్ల వివాదం పరిష్కారం అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఉన్నట్లుండి పవన్ కల్యాణ్ అభిమాని పేరిట ఓ వ్యక్తి ట్వీటర్లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తీవ్రమైన పదజాలంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తి ట్వీటర్లో పోస్టు చేయడం చర్చలకు ప్రతిష్టంభన కలిగించేలా మారాయి.

‘పవన్ కల్యాణ్ ఒక్క సినిమా రెమ్యునరేషన్‌లో సగం పాతిక కోట్లు నాకే ఇస్తే.. నా కుటుంబాన్ని జీవితాన్ని వదిలేస్తాను.. మానవ బాంబుగా మారి YS Jagan‌ను లేపేస్తా’ అంటూ ఓ వ్యక్తి పోస్ట్ పెట్టాడు. ‘అతనేంటి మా అన్నను తొక్కేది.. పేగులు మెడలో వేసుకొని తిరుగుతా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూర్చొంటా’ అంటూ మరో పోస్టు పెట్టాడు. అయితే ఈ పోస్టుపై భిన్నమైన కామెంట్స్ విన్పిస్తున్నాయి.

మహేష్ బాబు ఫొటోతో ఉన్నఆ నెటిజన్ పవన్ కల్యాణ్ అభిమానిగా చెప్పుకొంటూ చేశాడు. అతడి డీపీ ఫొటో మహేష్ బాబు ఉండటం.. అకౌంట్ పేరు బిజినెస్ మ్యాన్ అని ఉండటం గందరగోళానికి గురిచేస్తోంది. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ఖండించింది. ఈ పోస్టు పెట్టింది పవన్ కల్యాణ్ ఫ్యాన్ కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ డీజీపీని కోరారు.