https://oktelugu.com/

Lucky Bhaskar OTT: వంద కోట్ల లక్కీ భాస్కర్ ఓటీటీలో, అదిరిపోయే థ్రిల్లర్ అక్కడ చూసేయండి! డిటైల్స్

లక్కీ భాస్కర్ దీపావళి బ్లాక్ బస్టర్. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దుల్కర్ సల్మాన్ కి తెలుగులో ఈ మూవీ హ్యాట్రిక్. మూవీ విడుదలై నాలుగు వారాలు అవుతుండగా... ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఆద్యంతం ఆకట్టుకున్న లక్కీ భాస్కర్ మూవీ ఇంట్లో చూసి ఎంజాయ్ చూడండి. ఇంతకీ ఎక్కడ చూడొచ్చంటే..

Written By:
  • Vicky
  • , Updated On : November 27, 2024 / 05:43 PM IST

    Lucky Bhaskar OTT(1)

    Follow us on

    Lucky Bhaskar OTT: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస విజయాలు అందుకుంటున్నాడు. మహానటి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు దుల్కర్ సల్మాన్. ఆయనకు ఇది ఫస్ట్ తెలుగు స్ట్రెయిట్ మూవీ. కాకపోతే కీర్తి సురేష్ ప్రధాన పాత్ర చేసింది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కింది. కీర్తి సురేష్ సావిత్రి రోల్ చేయగా, దుల్కర్ సల్మాన్ ఆమె భర్త జెమినీ గణేష్ రోల్ చేశాడు. మహానటి తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.

    ఇక రెండో తెలుగు స్ట్రెయిట్ మూవీ సీతారామం. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన సీతారామం మూవీ మరో భారీ హిట్. తాజాగా లక్కీ భాస్కర్ మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు దుల్కర్ సల్మాన్. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా లక్కీ భాస్కర్ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 111 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.

    లక్కీ భాస్కర్ కి పోటీగా విడుదలైన అమరన్, క చిత్రాలు సైతం భారీ విజయాలు సాధించాయి. టఫ్ కాంపిటీషన్ మధ్య లక్కీ భాస్కర్ రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. అనంతరం విడుదలైన కంగువా, మట్కా చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం లక్కీ భాస్కర్ కి ప్లస్ అయ్యింది. మూడు వారాల పాటు థియేటర్స్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు లక్కీ భాస్కర్ థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ క్రమంలో ఓటీటీలో విడుదల అవుతుంది.

    లక్కీ భాస్కర్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 28 నుండి అందుబాటులోకి రానుంది. 27 అర్ధరాత్రి నుండే స్ట్రీమ్ కానుంది. మరో కొన్ని గంటల మాత్రమే సమయం ఉంది. ఇక లక్కీ భాస్కర్ మూవీ కథ పరిశీలిస్తే.. ఇది ముంబైలో జరిగిన 80ల నాటి కథ. బ్యాంక్ ఎంప్లాయ్ అయిన లక్కీ భాస్కర్ పేదరికంతో అల్లాడుతూ ఉంటాడు. ప్రమోషన్ కోసం ఎంతో కష్టపడతాడు. కానీ భాస్కర్ కి ప్రమోషన్ రాదు. ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు అడ్డదారి పడతాడు. కోటీశ్వరుడు అవుతాడు.. అనంతరం కొత్త సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎలా అధిగమించాడు అనేది కథ..