Vikas Sethi : గతంలో గుండెపోటు మరణాలు ఒక వయసుకు వచ్చిన తర్వాతే చోటు చేసుకునేవి. 60 తర్వాత వయసు ఉన్న వారు మాత్రమే గుండెపోటు కు గురయ్యేవారు. కానీ కరోనా తర్వాత గుండెపోటు మరణాలు సర్వసాధారణమైపోయాయి. ఇటీవల కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో ఓ యువకుడు గణేష్ మండపంలో డ్యాన్స్ చేస్తూ కుప్ప కూలిపోయాడు. వాస్తవానికి అతనికి ఎటువంటి అలవాట్లు లేవు. చివరికి మాంసాహారం కూడా తినడు. కానీ అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుకు గురై.. చూస్తుండగానే చనిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లే లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఆ యువకుడి భార్య 7 నెలల గర్భిణి. డాన్స్ చేసుకుంటూ తన భర్త గుండెపోటుకు గురై చనిపోవడంతో.. ఆమె గుండె లవిసేలా రోదిస్తోంది.
సాధారణంగా గుండెపోటు చోటుచేసుకుంటున్నప్పుడు చాతిలో నొప్పి ఉంటుంది.. అది క్రమేపి అధికమవుతుంది. ఆ తర్వాత అది గుండెపోటుకు దారితీస్తుంది. అయితే గుండెపోటు లో చాలా రకాలుంటాయి. కొందరికి తీవ్రంగా వస్తుంది. మరికొందరికి స్వల్పంగా వస్తుంది. స్వల్పంగా వచ్చిన వారికి కార్డియాలజిస్టులు శస్త్ర చికిత్స లేదా చికిత్స చేసి సాంత్వన కలిగిస్తుంటారు. అవసరమైతే హృదయానికి స్టంట్ వేస్తారు. మరి తీవ్రంగా ఉంటే బైపాస్ సర్జరీ చేస్తారు. అయితే ఇటీవల చోటు చేసుకుంటున్న గుండెపోటు మరణాలలో విచిత్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు వికాస్ సేథి ఉదంతాన్నే పరిగణలోకి తీసుకుంటే.. గుడ్డ పోటు రావడానికి ముందు వికాస్ కు వాంతులయ్యాయి. విరేచనాలు కూడా చోటుచేసుకున్నాయి. పైగా అందరికీ ఆ సమయంలో ఛాతిలో నొప్పి కూడా లేదు. జీర్ణ సంబంధిత సమస్య కూడా చోటు చేసుకోలేదు.. అయినప్పటికీ అతనికి గుండెపోటు వచ్చింది. అది తీవ్రంగా రావడంతో అతడి వెంటనే చనిపోయాడు. అయితే వికాస్ ఉదంతం వైద్య వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ” 8 నుంచి 33% గుండెపోటు కేసులలో చాతినొప్పి అనేది ఉండకపోవచ్చు. కడుపునొప్పి, వికారం, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. మధుమేహం, రక్తపోటు, అధిక కొవ్వు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఈసీజీ తీయించుకుంటూ ఉండాలి. సంబంధిత డాక్టర్లు సూచించిన మందులను ఎప్పటికప్పుడు వాడుతూ ఉండాలి. వ్యాయామం చేస్తూ ఉండాలి. మాంసాహారం మితంగా తినాలి. వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. వాడిన నూనెను మళ్ళీ వాడకూడదు. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని” వైద్యులు సూచిస్తున్నారు.
మధుమేహం, అధిక కొవ్వుతో బాధపడేవాళ్లు వైద్యులు సూచించిన మేరకు వ్యాయామం చేయాలి. లావుగా ఉన్నామని.. రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉందని భావించి.. చాలాసేపు మైదానంలో కసరత్తులు చేస్తే అది గుండె మీద ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. అందువల్లే సాధ్యమైనంతవరకు వ్యాయామాన్ని వైద్యులు సూచించిన మేరకే చేయాలని వివరిస్తున్నారు.
Actor #VikasSethi (Robbie from K3G) passed away earlier this day following a cardiac arrest. He was 48.
Also seen in films like Deewaanapan, Oops, ISmart Shankar and shows like Kyunki Saas Bhi Kabhi Bahu Thi, Kyun Hota Hai Pyar, Kahiin To Hoga, Kasautii Zindagii Kay, Uttaran &… pic.twitter.com/1fHuUNYtZT
— CinemaRare (@CinemaRareIN) September 8, 2024