https://oktelugu.com/

OTT Movies: దీపావళి సినిమాలు ఓటీటీలో చూసేయండి… ఎప్పుడు? ఎక్కడ?

2024 బ్లాక్ బస్టర్ దివాళి అని చెప్పొచ్చు. మూడు మేజర్ మూవీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. క, అమరన్, లక్కీ భాస్కర్ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. మరి ఈ సూపర్ హిట్ మూవీస్ ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు.. ఆ ఇంట్రెస్టింగ్ డిటైల్స్ మీ కోసం.

Written By:
  • S Reddy
  • , Updated On : November 2, 2024 11:04 am
    OTT Movies(1)

    OTT Movies(1)

    Follow us on

    OTT Movies: దీపావళి బరిలో పలు చిత్రాలు నిలిచాయి. వీటిలో అమరన్, క, లక్కీ భాస్కర్ చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలు అందుకున్న ఈ మూడు చిత్రాలు పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ ‘క’ తో ప్రేక్షకులను పలకరించాడు. వరుస పరాజయాల్లో ఉన్న కిరణ్ అబ్బవరం కి క మంచి విజయం అందించింది. పాజిటివ్ టాక్ నేపథ్యంలో ఓపెనింగ్స్ బాగున్నాయి. మొదటి రోజుకు మించిన రెస్పాన్స్ రెండో రోజు వచ్చింది.

    సుదీప్ అండ్ సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క మూవీ నచ్చకపోతే సినిమాలు చేయడం మానేస్తా అని సవాల్ విసిరి మరీ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఈటీవి విన్ దక్కించుకున్నట్లు సమాచారం. అక్కడ క మూవీ స్ట్రీమ్ కానుంది. క మూవీ సక్సెస్ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.

    సాయి పల్లవి-శివ కార్తికేయన్ హీరోగా నటించిన బయోపిక్ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించాడు. ముకుందన్ హిట్ టాక్ తెచ్చుకుంది. శివ కార్తికేయన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా అమరన్ నిలిచింది. ఈ మూవీలో సాయి పల్లవి నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అమరన్ తెలుగులో సైతం విశేష ఆదరణ పొందుతుంది. అమరన్ మూవీ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

    దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన పీరియాడిక్ క్రైమ్ డ్రామా లక్కీ భాస్కర్. హీరో దుల్కర్ సల్మాన్ ఆర్థిక నేరాలకు పాల్పడే స్కామర్ రోల్ చేశాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. లక్కీ భాస్కర్ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది. కలెక్షన్స్ కూడా బాగున్నాయి. లక్కీ భాస్కర్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. క, లక్కీ భాస్కర్, అమరన్ నాలుగు వారాల అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం కలదు. థియేట్రికల్ రన్ కొనసాగిన నేపథ్యంలో ఒకటి రెండు వారాలు ఆలస్యం కావచ్చు.