Jayasudha : చెన్నైలో పుట్టిన జయసుధ అసలు పేరు సుజాత. ఆమె తల్లి పేరు జోగా బాయ్. ఆమె కూడా నటి. ఆ క్రమంలో జయసుధ నటి వైపు మక్కువ చూపింది. 13ఏళ్ల వయసులో పండంటి కాపురం మూవీతో జయసుధ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. జయసుధకు ఫేమ్ తెచ్చిన మూవీ లక్ష్మణ రేఖ. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన జ్యోతి చిత్రంతో జయసుధ స్టార్ అయ్యారు.80ల వరకు ఆమె స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా వెలుగొందారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ అప్పట్లో సిల్వర్ స్క్రీన్ ని ఏలారు.
హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ ఆమె డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. హీరోల తల్లి పాత్రలకు బాగా ఫేమస్. ఎలాంటి పాత్రకైనా ఆమె సెట్ అవుతారు. సహజ నటనతో ఆకట్టుకుంటారు. అయితే జయసుధ నిర్మాణం వైపు కూడా అడుగులు వేసింది. ఆమె పలు చిత్రాలను నిర్మించారు.
అయితే ఒక సినిమా ఆమెను దారుణంగా దెబ్బ తీసింది. ఆ మూవీ పేరు హ్యాండ్సప్. నాగబాబు, జయసుధ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, తనికెళ్ళ భరణితో పాటు పలువురు నటులు భాగమయ్యారు. హ్యాండ్సప్ మూవీ కామెడీ క్రైమ్ డ్రామాగా దర్శకుడు శివ నాగేశ్వరరావు తెరకెక్కించారు. జయసుధ ఈ సినిమాకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసిందట. స్టార్ క్యాస్ట్ నటించడంతో రెమ్యూనరేషన్స్ రూపంలో బడ్జెట్ పెరిగింది.
ఎందుకైనా మంచిది అని.. చిరంజీవిని జయసుధ సహాయం కోరింది. ఆయన గెస్ట్ రోల్ చేశాడు. 2000లో విడుదలైన హ్యాండ్సప్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్లాప్ టాక్ నేపథ్యంలో హ్యాండ్సప్ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. చిరంజీవి గెస్ట్ అప్పీరెన్స్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. దాంతో జయసుధకు భారీ నష్టాలు వచ్చాయి. నటిగా సంపాదించిన డబ్బులు మొత్తం పోయాయట. ఈ విషయాన్ని జయసుధ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. హ్యాండ్సప్ మూవీ ఇచ్చిన షాక్ కి జయసుధ మరలా నిర్మాణం వైపు వెళ్ళలేదు.
జయసుధ 1982లో ఒకరిని వివాహమాడింది. అతడితో మనస్పర్థలు తలెత్తాయి. మొదటి భర్తతో విడిపోయిన జయసుధ 1985లో నిర్మాత నితిన్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు. జయసుధ భర్త నితిన్ కపూర్ 2017లో కన్నుమూశాడు. ఇటీవల ఓ అజ్ఞాతవ్యక్తితో జయసుధ కనిపించారు.