Ankitha: ఒకప్పుడు స్టార్ గా ఎదిగి ఓ వెలుగు వెలిగిన నటీనటులు కొన్ని రోజుల తర్వాత కనుమరుగైతే వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారని తెలుసుకోవాలని కోరికగా ఉంటుంది. ఇక అభిమాన నటీనటులు అయితే ఈ ఉబలాటం మరింత ఎక్కువగా ఉంటుంది. కొందరు స్టార్లుగా ఎదిగి కనీసం ఇప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా రోడ్డున పడ్డ సినీ సెలబ్రెటీలు ఎందరో ఉన్నారు. పాకీజా, పావలా శ్యామల వంటి వారి గురించి తెలిసిందే. అయితే హీరోయిన్ లు మాత్రం కెరీర్ ముగిసింది అని తెలియగానే మంచి వ్యాపారవేత్తను లేదో మరొకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా గడిపేస్తుంటారు. ఇప్పుడు అలాగే ఓ నటి జీవితం గురించి తెలుసుకుందాం.. మరి ఆ నటికి చివరి సినిమా ఏంటి? ఏ హీరో సినిమా వల్ల ఇండస్ట్రీలో కొనసాగలేక పోయింది అనేది కూడా తెలుసుకుందాం..
సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన అంకిత గురించి పరిచయం అవసరం లేదు. సింహాద్రి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. సింగమలై అంటే ఆ మాత్రం ఉంటుంది మరీ.. ఇక ఎన్టీఆర్ సరసన నటించిన అంకిత కూడా అందరికి గుర్తు ఉంటుంది. ఇక ఈమె రస్నా యాడ్ ద్వారా చాలా ఫేమస్ అయింది. సింహాద్రిలో మాత్రమే కాదు లాహిరి లాహిరి లాహిరిలో, విజయేంద్ర వర్మ, సీతారాముడు, ప్రేమలో పావని కళ్యాణ్, నవవసంతం, ఖతర్నాక్, మనసు మాట వినదు వంటి హిట్ సినిమాల్లో కూడా నటించింది.
తెలుగులో మాత్రమే కాదు కన్నడ, తమిళ ఇండస్ట్రీలో కూడా ఈ అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ సడన్ గా ఇండస్ట్రీలో కనిపించకుండా పోయే సరికి ఈమె అభిమానులు ఆందోళన చెందారు. సినిమాలో ఆఫర్లు రాకపోవడంతో 2016లో విశాల్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. దీనికి గల కారణం కూడా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది అంకిత. ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన సింహాద్రి సినిమా ద్వారా పాపులారిటీ పెంచుకున్న అమ్మడుపై హై రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. కానీ అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది.
ఇండస్ట్రీలో కెరీర్ అయిపోయింది అనుకున్న సమయంలో బాలకృష్ణ నటించిన విజయేంద్ర వర్మ సినిమాలో అవకాశం వచ్చిందని.. ఆ సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాను అని తెలిపింది. అందులో బాలయ్య నటించడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకుందట. బాలయ్య మీదనే ఆశలు పెట్టుకుందట. కానీ చివరకు ఈ సినిమా ఫ్లాప్ అవడంతో తన కెరీర్ ముగిసిందని తెలిపింది. ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువ రోజులు ఉండాలన్నా.. హీరోయిన్ గా రాణించాలన్నా సక్సెస్ మస్ట్. లేదంటే కనుమరుగవడం ఖాయం అంటూ తెలిపింది అంకిత. ఇక చివరకు బాలయ్య మీద పెట్టుకున్నా ఆశలు ఆవిరయ్యాయి అన్నమాట.