Game Changer : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఆ పాత్రలకు పెద్దగా ప్రత్యేకత అయితే లేకుండా పోతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఎస్ జె సూర్య పోషిస్తున్న ప్రతి పాత్ర ఆయనకు మంచి గుర్తింపును తీసుకురావడంతో పాటు కూడా విలనిజాన్ని కొత్త రీతిలో చెప్పే ప్రయత్నమైతే చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగిన విషయం కూడా తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికి రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో కొంతవరకు పర్లేదు అనిపిస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో విలన్ గా నటించడం ఎస్ జే సూర్య పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుంది. ఇక ఆపాత్రతోనే కామెడీని పండిస్తూ ఆపాత్రతోనే విలనిజాన్ని కూడా చేసి మెప్పించాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. కానీ సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో ఆయన భారీ సక్సెస్ ని అందుకోలేకపోతున్నారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తండ్రి చనిపోతే సీఎం పదవిని అనుభవించచ్చు అనే ఉద్దేశ్యంతో తన తండ్రిని చంపేసే క్యారెక్టర్ లో ఎస్ జే సూర్య నటించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి పొలిటిషన్స్ అందరూ ఇలానే ఆలోచిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక పొలిటిషన్ ఎలా ఉంటారో ఈ సినిమాలో చాలా పర్టిక్యూలర్ గా చూపించాడు. మరి ఈ పాత్రను కనక చూసినట్లయితే తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో కొంతమంది ఇలాంటి నాయకులు మనకు తారస పడుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా సూర్య రాజకీయ నాయకుడి పాత్రలో నటించి మెప్పించడం అందరికీ సంతోషాన్ని ఇచ్చింది.
ఇక ఇంతకుముందు నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా వైవిధ్యభరితమైన నటనని కనబరిచి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఆయితే సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇదిలా ఉంటే శంకర్ మాత్రం ఈ సినిమాతో తన సత్తాను చాటుకోలేకపోయాడనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోతుండటం తో ఇప్పుడు చేసిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిందనే చెప్పాలి…