https://oktelugu.com/

Game changer : గేమ్ చేంజర్ విషయం లో బాగా డిసప్పాయింట్ అయిన దిల్ రాజు…కారణం ఏంటంటే..?

ఒక సినిమా సెట్స్ మీదకి రావాలి అంటే ప్రొడ్యూసర్స్ ఆ సినిమాకు సంబంధించిన బడ్జెట్ ను కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. వాళ్లు లేకపోతే సినిమా అనేది ముందుకు సాగదు.

Written By:
  • Gopi
  • , Updated On : January 11, 2025 / 01:38 PM IST

    Game changer

    Follow us on

    Game changer : ఒక సినిమా సెట్స్ మీదకి రావాలి అంటే ప్రొడ్యూసర్స్ ఆ సినిమాకు సంబంధించిన బడ్జెట్ ను కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. వాళ్లు లేకపోతే సినిమా అనేది ముందుకు సాగదు. నిజానికి డబ్బులు పెట్టే వాళ్ళే ఇక్కడ చాలా గొప్ప వ్యక్తులు కానీ ఇండస్ట్రీలో మాత్రం హీరో, దర్శకులను మాత్రమే చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటారు. కానీ ప్రొడ్యూసర్ల గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడను కూడా మాట్లాడరు…

    ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు… ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు మొదటిసారి పాన్ ఇండియా సినిమాగా చేసిన గేమ్ చేంజర్ సినిమా నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి మొదటి షో నుంచే డివైడ్ టాక్ రావడంతో దిల్ రాజు పెట్టిన బడ్జెట్ మొత్తం వృధా కాబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ ని మూటగట్టుకోబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కడం వల్ల తీవ్రమైన నష్టం వాటిల్లబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    మరి ఆయన చేస్తున్న ఈ సినిమా ఆవరేజ్ గా అయిన నిలుస్తుందని ఆయన చాలావరకు ఆశపడ్డాడు. కానీ ఆయన అనుకున్నది ఏదీ జరగలేదు. కారణం ఏదైనా కూడా ఈ సినిమా దిల్ రాజుకి ఒక పీడ కలల మారిందని చాలామంది చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు ఈ సినిమా విషయంలో ఎలాంటి వైఖరిని పాటిస్తున్నాడు.

    తద్వారా ఆయన ఎలాంటి డిసీజన్స్ తీసుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని రాబడుతుంది. దాని ద్వారా అతనికి వచ్చే నష్టం ఎంత అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. మరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దిల్ రాజు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని ఈ నష్టాన్ని అందులో కవర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు సైతం ఇప్పుడు భారీ నష్టాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే రానుంది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ను నమ్ముకొని భారీగా మోసపోయాను అంటూ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇకమీదట శంకర్ ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలను చేసి ప్రొడ్యూసర్స్ ను హీరోలను జనాలను మోసం చేయకుండా ఉంటే మంచిదని చాలా మంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…