Homeట్రెండింగ్ న్యూస్Hyderabad : బర్డ్ ఫ్లూ జాన్తా నై.. మరీ ఇలా ఉన్నారేంట్రా.. దెబ్బకు గేట్లు మూసుకోవాల్సి...

Hyderabad : బర్డ్ ఫ్లూ జాన్తా నై.. మరీ ఇలా ఉన్నారేంట్రా.. దెబ్బకు గేట్లు మూసుకోవాల్సి వచ్చింది..

Hyderabad :  గత ఆదివారం మార్కెట్లో కిలో చేపలు 250 నుంచి 300 వరకు పలికాయి. మటన్ ధర కూడా 1000 వరకు పెరిగింది. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. బ్రాయిలర్ చికెన్ తినకూడదని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సూచనలు చేశాయి. దీంతో చికెన్ విక్రయాలు పడిపోయాయి. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ వైరస్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి పౌల్ట్రీ నిర్వాహకులు మేళాలు నిర్వహించారు. హైదరాబాద్ లోనే ఉప్పల్ గణేష్ నగర్, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్ లో నిర్వాహకులు ఫుడ్ మేళాలు నిర్వహించారు. చికెన్, ఎగ్ స్నాక్స్ తయారుచేసి ప్రజలకు ఉచితంగా అందించారు.. చికెన్, ఎగ్ స్నాక్స్(chicken egg snacks) అందించడంతో ప్రజలు భారీగా వచ్చారు. వచ్చిన వారందరికీ నిర్వాహకులు ఉచితంగానే వాటిని అందించారు. అయితే అంతకంతకూ జనం పెరిగిపోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. గేట్లు మూసివేశారు.. చికెన్, ఎగ్ స్నాక్స్ రుచికరంగా ఉండడంతో జనాలు విరగపడ్డారు. లొట్టలు వేసుకుంటూ తిన్నారు.

వదంతులు మాత్రమేనా

బర్డ్ ప్లూ నేపథ్యంలో చికెన్ విక్రయాలు పడిపోయినప్పటికీ.. జనం చికెన్, ఎగ్ స్నాక్స్ తినడానికి ఎగబడటంతో నిర్వాహకులు కూడా మొదట్లో ఆశ్చర్యపోయారు. జనం భారీగా రావడంతో ఆనందపడ్డారు. వారు ఊహించిన దాని కంటే జనం అధికంగా రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చికెన్ 65, చికెన్ తందూరి, చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్, ఫ్రైడ్ చికెన్, ఎగ్ ఆమ్లేట్, ఎగ్ పకోడీ, ఫ్రైడ్ ఎగ్.. వంటకాలు తయారు చేయడం.. అవి అత్యంత రుచికరంగా ఉండడంతో జనాలు తమ జిహ్వచాపల్యాన్ని ఆపు లేకపోయారు.. బర్డ్ ఫ్లూ జాన్తా నై అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తిన్నారు. దీంతో నిర్వాహకులు చేసిన పదార్థాలు మొత్తం పూర్తవ్వడంతో గేట్లు మూసివేశారు. హైదరాబాదులోనే కాదు, గుంటూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ” వామ్మో ఇంత జనం వచ్చారేంటి.. మేము అసలు ఊహించలేదు. బర్డ్ ప్లూ గురించి జనాలలో భయం ఉందనుకున్నాం. కానీ దానిని వారి పక్కనపెట్టి మా స్టాల్స్ వద్దకు వచ్చారు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అన్నట్టుగా తిని పడేశారు. మేము తయారు చేసిన వంటకాలు మొత్తం పూర్తి కావడంతో గేట్లు వేశాం. కేవలం గంటల వ్యవధిలోనే ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. వండిన పదార్థాలను మొత్తం అవలీలగా తినేశారు.. వారు తింటూ ఉంటే మాకే ఆశ్చర్యం అనిపించింది.. ఇలాంటి వాళ్లు బ్రాయిలర్ చికెన్ కొనకుండా ఎలా ఉంటున్నారని మాలోమాకే అనుమానం వచ్చిందని” నిర్వాహకులు పేర్కొన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version