హొమ్లీ హీరోయిన్ అనుపమ పెళ్లి గురించి నేషనల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వరుసుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెల్స్, వెబ్ సైట్స్ లో అనుపమ పెళ్లి అంటూ హడావుడి చేశాయి. తన పెళ్లి విషయంలో గోల గోల చేస్తోన్న అందరికీ.. అనుపమ తల్లి సునీతా పరమేశ్వరన్ మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చింది.
Also Read: క్రిష్ ఒక్కడికి సాధ్యం కావట్లేదట.. పవన్ సినిమాకు మరో డైరెక్టర్?!
ఐతే ఉన్నట్టు ఉండి అనుపమ పెళ్లి అంటూ వార్తలు రావడానికి కారణం… క్రికెటర్ బుమ్రా పెళ్లి చేసుకోబుతుండడమే. బుమ్రాతో అనుపమ డేటింగ్ చేస్తోందని చాలాకాలంగా వార్తలు వస్తుండంతో మీడియా కూడా బుమ్రా పెళ్లి చేసుకోబోయేది అనుపమనే అని ఫిక్స్ అయింది. కానీ చివరకు ఇదంతా ఉత్తిదే అని తేలింది. అయితే ఇంత జరుగుతున్నా.. అనుపమ మాత్రం తన పెళ్లి వార్తల పై అసలు స్పందించలేదు. రెండు రోజులుగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు పెడుతూ తనకేం సంబంధం లేదనట్టు ఉంది ఆమె వ్యవహారం.
Also Read: ఫుల్ గ్లామరస్ రోల్ లో ‘కీర్తి సురేష్’ !
పైగా అనుపమ పెడుతున్న పోస్ట్ లలో కూడా, తాను ఎంత హ్యాపీగా ఉన్నానని చేబుతునట్లు ఉంది. తన పని ఏదో తానూ చేసుకుంటూ తన పెళ్లి పుకార్లని మాత్రం పూర్తిగా ఇగ్నోర్ చేసింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతానికి అనుపమ ‘కార్తికేయ 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే దిల్ రాజు నిర్మిస్తున్న మరో సినిమాలో కూడా అనుపమ మరో కీలక పాత్రలో నటిస్తోంది. తెలుగులో మళ్ళీ బిజీ అవ్వడానికి అనుపమ ఈ మధ్య బాగానే కష్టపడుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్