War 2 Closing Collections: ప్రతీ హీరో సినిమా కెరీర్ లోనూ మాయని మచ్చ లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి. అలా జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కెరీర్ లో గతం లో అలాంటి మాయని మచ్చలు చాలానే ఉన్నాయి కానీ, టెంపర్ చిత్రం నుండి దేవర వరకు వరుసగా 7 బ్లాక్ బస్టర్ సినిమాలను అభిమానులకు అందించి, వాళ్లకి ఎత్తిన కాలర్ ని దించకుండా చేసాడు. కానీ రీసెంట్ గా విడుదలైన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. హిందీ లో ఈమధ్య కాలం లో సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి ఒక మోస్తారు గా అక్కడ వసూళ్లను రాబట్టింది కానీ, తెలుగు లో మాత్రం కనీస స్థాయి మినిమం గ్యారంటీ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి క్లోజింగ్ లో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 347 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
వీటి లో తెలుగు వెర్షన్ నుండి కేవలం 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నాగవంశీ 92 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. కానీ క్లోజింగ్ లో 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అది కూడా రిటర్న్ GST యాడ్ చేస్తేనే. లేదంటే 36 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే. ఇక ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక నుండి 8 కోట్ల 59 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళనాడు + కేరళ ప్రాంతాలకు కలిపి కేవలం 3 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అదే విధంగా హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 87 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
అదే విధంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి 36 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 178 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 347 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 92 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వాటిల్లాయి. థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి అవ్వడం తో మేకర్స్ త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ విడుదల చేయబోతున్నారు. థియేటర్స్ లో ఘోరమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం,కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. అంతే కాకుండా వార్ 2 సినిమా ఎన్టీఆర్ కి ఒక వార్నింగ్ లాంటిదని, ఇక నుండి ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ కి నో చెప్పాలంటూ సోషల్ మీడియా లో అభిమానులు కోరుకుంటున్నారు.