Pawan Kalyan OG Promotions: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో రోజురోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈమధ్య కాలం లో మన తెలుగు ఆడియన్స్ ఇంతలా ఒక సినిమా కోసం ఎదురు చూడడం ఈ చిత్రానికే జరిగింది. పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక న్యూ ఏజ్ కంటెంట్ స్టోరీ తో మన ముందుకు రాబోతుండడం వల్లే ఈ సినిమాకు ఇంతటి క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు రెండేళ్ల క్రితం ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అప్పటి వరకు ఈ చిత్రం పై అభిమానుల్లో మాత్రమే క్రేజ్ ఉండేది. కానీ ఈ గ్లింప్స్ వీడియో మామూలు ఆడియన్స్ లో కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా విడుదలైన రెండు పాటలు, అదే విధంగా పవన్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన మరో గ్లింప్స్ వీడియో కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
దీంతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో ప్లాగొంటాడా లేదా అని సోషల్ మీడియా లో అభిమానులు నిర్మాతలను ట్యాగ్ చేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన తన గత చిత్రం ‘హరి హర వీరమల్లు’ ని కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఒక రేంజ్ లో ప్రమోట్ చేశాడు. ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. పవన్ తన సినిమాని ఈ రేంజ్ లో ప్రమోట్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక మీదట తన అన్ని సినిమాలకు ఇలాగే ప్రమోట్ చేస్తాడని అంతా అనుకున్నారు కానీ, ఓజీ ప్రొమోషన్స్ కి ఆయన పాల్గొనడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. కేవలం ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే ఆయన కనిపిస్తాడట. మిగిలిన ఈవెంట్స్ కి హాజరు అవ్వలేనని మేకర్స్ కి ముందుగానే చెప్పేశాడట.
దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త నిరుత్సహానికి గురయ్యారు.’హరి హర వీరమల్లు’ కి అలా ప్రొమోషన్స్ చేయడం సెంటిమెంట్ కలిసిరాలేదు అనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా ప్రొమోషన్స్ కి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడేమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. కానీ రేపటి నుండి మాత్రం మూవీ టీం ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని, ఒక సినిమాని ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఈ ప్రొమోషన్స్ ఉండబోతున్నాయని, ప్రతీ రోజు అభిమానులకు పండగే అని ఈ సినిమా సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్ లో టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. నార్త్ అమెరికా లో అప్పుడే 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేసింది. ఇక లండన్ , జర్మనీ వంటి ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్స్ నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోతున్నాయి. చూస్తుంటే ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ ని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.