Mega Family
Mega Family : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చాలా అవుట్ డేటెడ్ సినిమాలు వస్తూ ఉండేవి. తద్వారా ఇతర భాషల్లో ఉన్న చాలా మంది మన తెలుగు సినిమాలను హేళన చేస్తూ ఉండేవారు. మూడు ఫైట్లు, నాలుగు కుళ్ళు జోకులు, ఐదు పాటలతో సినిమాని లాగించేస్తారు అంటూ చాలావరకు మన సినిమాలను లెక్క చేసేవారు కాదు. బాహుబలి సినిమా ఎపుడైతే వచ్చిందో అప్పటినుంచి తెలుగు సినిమా స్థాయి అనేది మారిపోయింది. మరి ఇలాంటి సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటులు సైతం ఇప్పుడు పాన్ ఇండియాలో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయం లో ఒక్కో పై చేయి సాధిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతుంటే మరికొద్ది సార్లు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ లను సంపాదించుకోవడమే కాకుండా ఆయా హీరోలకి భారీ ఇమేజ్ ను కూడా కట్టబెడుతూ ఉంటాయి. ఇక మరికొన్ని సందర్భాల్లో అక్కినేని ఫ్యామిలీ ఘట్టమనేని ఫ్యామిలీ లు సైతం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు… అయితే గత కొద్ది రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి అసలు ఏ సినిమాలు కలిసి రావడం లేదు…చిరంజీవి చేసిన ‘భోళా శంకర్’ పవన్ కళ్యాణ్ చేసిన ‘బ్రో’ వరుణ్ తేజ్ చేసిన ‘గాండీవ దారి అర్జున’, ‘ మట్కా’ , రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరి ఇలాంటి సందర్భంలో మెగా ఫ్యామిలీని మరోసారి గాడిలో పెట్టాల్సిన బాధ్యత చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ల పైన ఉందని సగటు ప్రేక్షకులంతా అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర (Vishvam bhara) సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాను కూడా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా మొత్తం షేక్ అయ్యేలా సక్సెస్ లను సాధించి మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలందరికీ బుస్టాప్ ఇచ్చే విధంగా ఈ సీనియర్ హీరోలు వాళ్ళకంటూ ఒక భారీ ప్రయత్నమైతే చేయబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
మరి ఇలాంటి సందర్భంలోనే మెగా అభిమానులు సైతం ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటితో సూపర్ సక్సెస్ ను కనక సాధించినట్టయితే చిరంజీవి మరోసారి సక్సెస్ బాట పడతాడు.
పవన్ కళ్యాణ్ సైతం చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని దక్కించుకొని తన అభిమానుల్లో ఒక ఆనందాన్ని నింపినవాడు అవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ హీరోలు ఇద్దరు కలిసి మరోసారి మెగా ఫ్యామిలీకి అండగా నిలవడమే కాకుండా రాబోయే సినిమాలన్నింటికి వాళ్ళు బూస్టప్ ఇవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు…