War 2 : #RRR, దేవర(Devara Movie) వంటి సంచలన విజయాల తర్వాత ఎన్టీఆర్(Junior NTR) చేస్తున్న చిత్రం ‘వార్ 2′(War 2).. హృతిక్ రోషన్(Hritik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా సాగిపోతున్న ఈ సినిమాని ఆగస్టు 15 న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఆయన ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాలెంటైన్స్ డే రోజున ఎదో ఒక అప్డేట్ వస్తుందని ఆశించారు కానీ, అలాంటిదేమి జరగలేదు. దీంతో నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘#WeWantWar2Update’ అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. మూవీ టీం నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ త్వరలోనే టీజర్ కి సంబంధించిన కీలక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.
శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ టీజర్ కి సంబంధించిన పనులు పూర్తి అయ్యాయని, రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ మూవీ కాన్సెప్ట్ ఏంటో తెలియచేస్తుందనీ, ఎన్టీఆర్ అభిమానులకు, హృతిక్ రోషన్ అభిమానులకు ఈ టీజర్ విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ కూడా లీకైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ క్యారక్టర్ పేరు వీరేంద్ర రఘునాథ్. కబీర్ లీడ్ చేస్తున్న రా ఏజెన్సీ లో ఒక కీలకమైన ఆపరేషన్ కి వెళ్లిన సమయంలో, ఆ టీం కి సంబంధించిన వాళ్ళు ఎన్టీఆర్ ని మోసం చేయడం తో, ఇండియా కి శత్రువుగా మారి ఉగ్రవాదిలా తయారు అవుతాడని, కబీర్ పై పగ తీర్చుకునే క్రమం లో విద్వంసం సృష్టిస్తాడని తెలుస్తుంది.
ఎన్టీఆర్ క్యారక్టర్ కేవలం ఈ ఒక్క సినిమాతోనే పరిమితం కాదు, బాలీవుడ్ లో స్పై యూనివర్స్ లో వచ్చే అన్ని సినిమాల్లోనూ ఆయన ఉంటాడట. అంటే త్వరలోనే ఆయనని మనం షారుఖ్ ఖాన్ తో, సల్మాన్ ఖాన్ తో కూడా చూడొచ్చు అన్నమాట. ఇకపోతే ‘వార్ 2’ టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ అదిరిపోయాయని, హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎన్టీఆర్ తన డైలాగ్స్ తో డామినేట్ చేసాడని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మిక్సింగ్ జరుగుతుంది. ఈ చిత్రం లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ పాత్రలో పది నిమిషాల పాటు ఈ చిత్రంలో కనిపిస్తాడని ఒక టాక్ వినిపిస్తుంది. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియనుంది.