War 2 Release: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) లాంటి నటుడు సైతం నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియాలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సంవత్సర ఆగస్టు 14వ తేదీన ‘వార్ 2’ (War) సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆ టీజర్ ను చూసిన ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు.
మరి హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో అలాగే జూనియర్ ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ ప్రయోగంలో సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఎన్టీఆర్ కి ఈ సినిమా ఎలాంటి గుర్తింపును ఇస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
సినిమా రిలీజ్ అయితే గాని ఎన్టీఆర్ కి ఈ సినిమా వల్ల ఎలాంటి క్రేజ్ వస్తుంది అనేది తెలీదు… మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ ని హృతిక్ రోషన్ డామినేట్ చేస్తాడా? లేదంటే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ను డామినేట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. వీళ్లిద్దరి మధ్య పోటీలో ఎవరు విజయం సాధిస్తారు? ఎవరు గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…