War 2 : టాలీవుడ్ లో కాంట్రవర్షియల్ కామెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఇది వరకు ఆయన మన స్టార్ హీరోల మీద, రాజకీయ నాయకుల మీద ఎలాంటి కామెంట్స్ చేసేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన అందరి హీరోలపై ఇప్పటి వరకు సెటైర్స్ వేశాడు కానీ, మెగా ఫ్యామిలీ పై అత్యధికంగా ట్రోల్స్ వేసేవాడు. ఇక రాజకీయంగా అయితే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), చంద్రబాబు(Cm Chandrababu Naidu) లపై ఏకంగా మార్ఫింగ్ ఫోటోలు కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో అప్లోడ్ చేసి ఛీ కొట్టించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. అరెస్ట్ వరకు కూడా వెళ్ళాడు కానీ చివరికి తప్పించుకున్నాడు. అయితే ఈమధ్య కాలం లో ఎప్పుడూ కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) పై కామెంట్స్ చేయలేదు.
Also Read : ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!
కానీ నిన్న మాత్రం ఆయన ట్విట్టర్ చాలా మెత్తగా ఎన్టీఆర్ పై సెటైర్లు వేశాడు. నిన్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్ 2’ మూవీ టీజర్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అభిమానులకు ఈ టీజర్ నచ్చింది కానీ, ఇతర హీరోల అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఒక అభిమాని టీజర్ లో చూపించే ఎన్టీఆర్, హృతిక్ రోషన్(Hrithik Roshan) కళ్ళ షాట్స్ ని పక్కపక్కన పెట్టి ‘కళ్ళు చెప్తున్నాయి ఎవరు ఏంటో’ అని అంటాడు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ ‘అవును’ అంటూ ఆ ట్వీట్ ని క్వాట్ చేస్తాడు. ఈ ట్వీట్ క్రింద ప్రభాస్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది ఎన్టీఆర్ ని వెక్కిరిస్తూ వేసిన పోస్ట్ అని నవ్వుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా రామ్ గోపాల్ వర్మ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పుట్టినరోజు నాడు కూడా ఎందుకు ఇంత ఏడుపులు అంటూ మండిపడ్డారు.
ఒకవేళ రామ్ గోపాల్ వర్మ ని ఎందుకు ఇలాంటి ట్వీట్ వేశారు అని ఏదైనా ఇంటర్వ్యూ లో అడిగితే ‘అది నేను ఎన్టీఆర్ ని పొగుడుతూ వేసిన ట్వీట్’ అని తెలివి గా సమాధానం చెప్పి తప్పించుకుంటాడు, కానీ ఆయన నిజమైన ఉద్దేశ్యం ట్రోల్ చేయడమే. అది చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది. ఏది ఏమైనా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన హీరో ని, తెలుగు సినిమాల కారణంగా ఎదిగిన ఒక స్టార్ డైరెక్టర్ ఇలా నార్త్ ఇండియన్స్ ముందు చులకన చేసి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. అది కూడా పుట్టినరోజు నాడు ఇలాంటి కామెంట్స్ చేయడం అంటే రామ్ గోపాల్ వర్మ మైండ్ సెట్ ఎలాంటిదో తెలియజేస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్వీట్ కి ఆయన వివరణ ఇస్తాడో లేదో చూడాలి.
— Ram Gopal Varma (@RGVzoomin) May 20, 2025