Arya 3 : అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన చిత్రం ‘ఆర్య’. అప్పట్లో ఈ చిత్రం యూత్ ఆడియన్స్ లో ఒక సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ సుకుమార్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. అల్లు అర్జున్ కి ఇది కేవలం రెండవ సినిమా మాత్రమే. రెండవ చిత్రం తోనే నటనలో ఎన్నో వందల సినిమాల అనుభవం ఉన్న నటుడిగా నటించి శభాష్ అనిపించుకున్నాడు అల్లు అర్జున్. అలాంటి చిత్రానికి సీక్వెల్ గా ‘ఆర్య 2’ తెరకెక్కింది. 2009 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం మ్యూజిక్ పరంగా ఒక సునామీ ని సృష్టించింది. కానీ సినిమా మాత్రం కమర్షియల్ గా గొప్పగా ఆడలేదు అనేది వాస్తవం. సరిగ్గా ఆ సమయం లో తెలంగాణ ఉద్యమం తారా స్థాయికి చేరడంతో దాని ప్రభావం ఈ చిత్రంపై బలంగా పడింది.
Also Read : ‘సలార్’ ని మించిన ‘ఆర్య 2’ రీ రిలీజ్..మొదటిరోజు ఎంత గ్రాస్ వచ్చిందంటే!
దాని వల్ల కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ అని అనిపించుకుంది. కానీ అల్లు అర్జున్ కి ఒక నటుడిగా, డ్యాన్సర్ గా ఈ చిత్రం తీసుకొచ్చిన గుర్తింపు మామూలుది కాదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ స్టెప్స్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఒక విధంగా ఆయనకు నార్త్ ఇండియా లో ఫాలోయింగ్ మొదలైంది ఈ చిత్రం నుండే. అక్కడి ఆడియన్స్ అల్లు అర్జున్ డ్యాన్స్ స్టెప్పులకు మెంటలెక్కిపోయారు. అసలు ఇతను నిజంగా మనిషేనా?, శరీరంలో ఎముకలకు బదులుగా స్ప్రింగ్స్ ఉన్నాయా?, అవేమి డ్యాన్స్ లు బాబోయ్ అంటూ అప్పట్లో పొగడ్తలతో ముంచి ఎత్తారు. కేవలం నార్త్ ఇండియా లో మాత్రమే కాదు, ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది. గమ్మత్తు ఏమిటంటే ఈ సినిమాని ఆరోజుల్లో ఏ భాషలో కూడా డబ్ చేయలేదు. అయినప్పటికీ దేశం మొత్తం ఆయన స్టెప్పులకు ఊగిపోయింది.
అయితే ‘ఆర్య 2’ కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వలేదు కాబట్టి, ఇక ఈ సినిమాకు కొనసాగింపు ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా SVC సంస్థ ఫిల్మ్ ఛాంబర్ లో ‘ఆర్య 3’ టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. కచ్చితంగా ఈ సినిమా భవిష్యత్తులో ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఇందులో అల్లు అర్జున్ హీరో గా నటించే అవకాశమే లేదట. ఎందుకంటే అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు వేరు. ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ స్కోప్ లో తెరకెక్కుతాయి. ఇలాంటి సమయం లో ఆయన లవ్ స్టోరీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఆయనకు బదులుగా కుర్ర హీరోలతో చేయించాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ సినిమాకు సుకుమార్ కథ ని అందించబోతున్నాడు. అయితే ‘ఆర్య’ కి ‘ఆర్య 2’ కథ పరంగా ఎలాంటి సంబంధం ఉండదు. రెండు విభిన్నమైన సినిమాలు, ‘ఆర్య 3′(Aarya 3) కూడా అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read : ‘ఆర్య 2’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఏ రేంజ్ ఉందంటే!