War 2 Posters Released: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War2 Movie) చిత్రం మరో 50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా మేకర్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ లకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్స్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ పోస్టర్స్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అతిసయోక్తి అనుకోకపోతే విడుదల చేసిన మూడు పోస్టర్స్ లో కియారా అద్వానీ పోస్టర్స్ నెటిజెన్స్ కి తెగ నచ్చేసింది. ఇందులో ఆమె యాక్షన్ సన్నివేశాలు దంచికొట్టేసిందట. టీజర్ లో ఈమె హృతిక్ రోషన్ కి జోడిగా కనిపించింది. సినిమాలో ఈమె క్యారక్టర్ నుండి ఏమైనా ట్విస్ట్స్ ఉంటాయేమో చూడాలి. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. టీజర్ తోనే ఎన్టీఆర్ క్యారక్టర్ పై అందరికీ ఒక అంచనా వచ్చేసింది.
Bet you haven’t ever seen a WAR like this!
Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025
నెగిటివ్ క్యారక్టర్ అయినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు ఏ మాత్రం నొచ్చుకొని విధంగా ఆయన క్యారక్టర్ ని డిజైన్ చేశాడట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. అభిమానులు దీనిని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను ఎన్టీఆర్ పూర్తి చేసాడు. హృతిక్ రోషన్ డబ్బింగ్ కూడా పూర్తి అయ్యిందట. వచ్చే నెల నుండి వీళ్లిద్దరు ప్రొమోషన్స్ ఒక నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీ ఉన్నాడు. ఈ నెలాఖరుతో షెడ్యూల్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ‘వార్ 2’ ప్రొమోషన్స్ కి డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే హృతిక్ రోషన్ నార్త్ అమెరికా పర్యటనలో ఈ సినిమా గురించి ఫుల్ ప్రొమోషన్స్ చేసాడు. #RRR మూవీ ప్రొమోషన్స్ ఆ సినిమాకు ఎంత ప్లస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
Also Read: NTR look In War 2: ‘వార్ 2’ లో జనాలు గుర్తుపట్టలేని గెటప్ లో ఎన్టీఆర్..ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్!
#RRR మూవీ ప్రొమోషన్స్ మొత్తం లో ఎన్టీఆర్ ఎక్కువగా హైలైట్ అవుతూ వచ్చాడు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో కూడా ఆయనే హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదలయ్యే రోజునే రజనీకాంత్ ‘కూలీ’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా మీద ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ హైప్ ని డామినేట్ చేసే రేంజ్ లో ‘వార్ 2’ ఉండాలంటే కచ్చితంగా ప్రొమోషన్స్ క్లిక్ అవ్వాలి. చూడాలి మరి ఎంత వరకు ఈ సినిమా రీచ్ అవ్వగలదు అనేది.