NTR look In War 2: ‘దేవర’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నుండి రాబోతున్న చిత్రం ‘వార్ 2′(War 2 Movie). హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరో గా నటించిన ఈ సినిమా లో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేసాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యాష్ రాజ్ యాక్షన్ ఫిలిమ్స్ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో, వాటిని మ్యాచ్ చేసే విధంగా ఈ వార్ 2 టీజర్ ఉన్నట్టుగా అనిపించింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు కూడా ఈ సినిమాకి హైలైట్ కాబోతున్నాయని ఈ టీజర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. అంతే కాదు వీళ్లిద్దరు అద్భుతమైన డ్యాన్సర్స్. వీళ్ళ మధ్య డ్యాన్స్ లేకపోతే ఎలా ?, నాటు నాటు రేంజ్ లో ఒక డ్యాన్స్ నెంబర్ ని కూడా ప్లాన్ చేశారట మేకర్స్.
త్వరలోనే ఈ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. మన దగ్గర వీడియో సాంగ్స్ పూర్తిగా వదిలే ట్రెండ్ లేదు. కానీ బాలీవుడ్ లో సినిమా విడుదలకు ముందే వీడియో సాంగ్స్ ని రిలీజ్ చేసే ట్రెండ్ ఉంది. అలా ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరో డ్యాన్స్ ని సినిమా విడుదలకు ముందే చూడబోతున్నారు అన్నమాట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంటుందట. ఎన్టీఆర్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ చాలా యంగ్ గా కనిపిస్తాడట. ఆ లుక్ ని అభిమానులకు సైతం గుర్తు పట్టడం కొద్దిగా కష్టమే అని అంటున్నారు. ఆ రేంజ్ లో ఆ లుక్ ని డిజైన్ చేశారట. ఫ్లాష్ బ్యాక్ లో ప్రాణ మిత్రులుగా ఉన్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ భద్ర శత్రువులుగా ఎందుకు మారారు అనేదే ఈ సినిమా స్టోరీ.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా కియారా అద్వానీ(Kiara Advani) నటించిన సంగతి తెలిసిందే. ఈమె కూడా టీజర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చింది. రీసెంట్ గా ఒక థియేటర్ లో ‘వార్ 2’ మూవీ టీజర్ ని ప్లే చేశారు. ఈ టీజర్ లో ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ వచ్చినప్పుడు థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ, కియారా అద్వానీ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ దద్దరిల్లిపోయింది. దీనిని చూసి కియారా కి మామూలు క్రేజ్ లేదు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మట్కాడుకుంటున్నారు. ఇందులో కియారా అద్వానీ హృతిక్ రోషన్ కి జోడీగా నటించింది. మరి ఎన్టీఆర్ కి హీరోయిన్ ఉందో లేదో ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియదు. అయితే హృతిక్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కి మధ్య ఒక కామన్ కనెక్షన్ ఉంటుందని సమాచారం.