https://oktelugu.com/

War 2: వార్ 2 మూవీ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ హెల్ప్ అవ్వనుంది..?

సినిమా ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ప్లాట్ ఫామ్ ఎవరికి వారు సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు. నిజానికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అయిపోయింది. కానీ ఒకప్పుడు నార్త్, సౌత్ అనే తేడాలు ఉండేవి... దానివల్ల ఇండస్ట్రీ ల మధ్య చాలా పెద్ద పోటీ అయితే ఉండేది...

Written By:
  • Vicky
  • , Updated On : September 21, 2024 / 01:48 PM IST

    War 2

    Follow us on

    War 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసే సినిమాల్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటూనే, ప్రతి ప్రేక్షకుడిని ఆయన చాలా వరకు తన పర్ఫామెన్స్ తో కట్టిపడేస్తు ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే సోలోగా దేవర సినిమాతో పాన్ ఇండియాలో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ డైరెక్టర్ అయిన ‘అయాన్ ముఖర్జీ’ డైరెక్షన్ లో వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఎన్టీఆర్ ఆ సినిమాలో రామ్ చరణ్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ఇమేజ్ ని సంపాదించుకున్నాడనే చెప్పాలి.

    మరి అయిన కూడా మరోసారి ఆయన మల్టీస్టారర్ సినిమా చేయడానికి అంగీకరించి చేస్తున్నాడు అంటే నిజంగా ఎన్టీఆర్ గొప్పతనం అనే చెప్పాలి. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండబోతుంది…ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరికి ఎక్కువ పేరు రాబోతుంది అనే విషయాల మీద ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు.

    మరి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆల్రెడీ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయితే అయింది. మరి వార్ 2 సినిమాలో కూడా మళ్లీ అదే జరగబోతుందా? ఎన్టీయార్ ఈ సినిమాను ఎందుకు చేస్తున్నాడు అంటూ మొదటి నుంచి కూడా వాళ్ళ బాధలను వినిపిస్తూ వస్తున్నారు. నిజానికి బాలీవుడ్ డైరెక్టర్లు ఎవరూ తెలుగు హీరోలని గొప్పగా చూపించే ప్రయత్నం అయితే చేయరు. ఇక అందులో భాగంగానే ఓం రావత్ లాంటి దర్శకుడు కూడా ప్రభాస్ ను చాలా వరకు డీగ్రేడ్ చేసి చూపించిన విషయం మనకు తెలిసిందే.

    మరి తెలిసి తెలిసి మళ్ళీ ఎన్టీఆర్ వాళ్లతో ఎందుకు సినిమాకి కమిట్ అయ్యాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం తన క్యారెక్టర్ ఈ సినిమాలో హైలైట్ అవుతుందని చాలా కాన్ఫడెంట్ గా ఉన్నాడు. మరి సినిమా ఈ రిలీజ్ అయితే గాని హృతిక్ రోషన్ కి ఎక్కువ పేరు వస్తుందా? లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కి సపరేట్ గుర్తింపును తీసుకు వస్తుందా అనే ప్రశ్న కి సమాధానం దొరకదు…