Pawan Kalyan: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం పై కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డు స్థాయి గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో మరో రెండు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించుకోబోతుంది. విడుదలకు కావాల్సిన టికెట్ రేట్స్ హైక్స్, అదనపు షోస్ కి అనుమతి కూడా వచ్చేసింది. ఇక ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ పెట్టడానికి ఎన్టీఆర్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా అడగగానే టికెట్ రేట్స్ ఇచ్చినందుకు ఆ చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియచేసారు.
ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘మా చిత్రానికి అడగగానే అన్ని రకాల అనుమతులు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మిస్టర్ కందుల దుర్గేష్ గారికి కృతఙ్ఞతలు’ అంటూ ట్వీట్ వేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. గత ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్ రేట్స్ భారీగా తగ్గిస్తూ ఎలా టార్గెట్ చేసారో మన అందరికీ తెలిసిందే. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ చిత్రాలకు అర్థరాత్రి జీవోలు తీసుకొచ్చి, టికెట్ రేట్స్ 10 ,20,30 పెట్టారు. దీని వల్ల ఆ రెండు సినిమాలకు కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. నష్టాలు రావడం తో పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ నుండి కట్ చేసుకొని బయ్యర్స్ కి ఇచ్చాడు. అలాంటి స్థాయి నుండి నేడు తన తోటి స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇచ్చే రేంజ్ కి ఎదిగిన పవన్ కళ్యాణ్ ని చూసి ఆయన అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.
మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ‘దేవర’ చిత్రానికి కావాల్సిన అనుమతులు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తూ, వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అర్థరాత్రి 12 గంటల నుండి షోస్ మొదలు కానున్నాయి. ఇప్పటి వరకు అర్థ రాత్రి షోస్ తో మొదలైన సినిమాలు అత్యధికంగా ఫ్లాప్ అయ్యాయి. కేవలం బాహుబలి సిరీస్, సలార్ మాత్రమే పెద్ద హిట్ అయ్యాయి. అందరి అభిమానులు లాగానే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎలాంటి టాక్ వస్తుందో అని భయపడుతున్నారు. కానీ ఇంటర్వ్యూస్ లో ఎన్టీఆర్ ఈ సినిమా మీద ఎంతో నమ్మకంతో మాట్లాడిన మాటలను చూసి కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు.
My heartfelt thanks to the Government of Andhra Pradesh, CM @ncbn garu, Deputy CM @PawanKalyan garu and Cinematography minister @kanduladurgesh for granting all the necessary permissions for the grand release of our magnum opus #Devara.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 21, 2024