War 2 Telugu Collections: ఏ సినిమాకి అయినా రోజులు గడిచే కొద్దీ కలెక్షన్స్ పెరుగుతూ పోతుంటాయి. కానీ చరిత్ర లో మొట్టమొదటిసారి ఒక సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కూడా తిరుగుతున్నాయి. ఆ సినిమానే ‘వార్ 2′(War 2 Movie). తెలుగు వెర్షన్ లో ఈ సినిమాకు మొదటి సోమవారం ప్రతీ సెంటర్ లోనూ డెఫిసిట్స్ నమోదు అయ్యాయి. డెఫిసిట్ అంటే థియేటర్ ని ఒక రోజు నడిపేందుకు అయ్యే ఖర్చు ని కూడా రాబట్టలేకపోవడం అన్నమాట. అలా ఈ సినిమా నడుస్తున్న ప్రతీ సెంటర్ లోనూ ఇదే పరిస్థితి. ఇలా ఒక ఫ్లాప్ సినిమాకు జరగడం కొత్తేమి కాదు, గతం లో చాలా సినిమాలకు జరిగాయి. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే కమీషన్ బేసిస్ మీద రన్ చేస్తారు. అంటే ఒక థియేటర్ లో వచ్చిన గ్రాస్ లో కొంత వాటా థియేటర్ వాళ్లకు, కొంత వాటా డిస్ట్రిబ్యూటర్ కి అన్నమాట.
Also Read: ‘వార్ 2’ కి ముందు అనుకున్న స్టోరీ ఇదేనా? అలా తీసుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది!
కానీ ఈ సినిమాకు చేసుకున్న అగ్రీమెంట్స్ ప్రకారం గురువారం వరకు రెంటల్ బేసిస్ మీద మాత్రమే రన్ అవ్వాలి. అందుకే అన్ని ప్రాంతాల్లో షేర్స్ కరువై డెఫిసిట్స్ నమోదు అయ్యాయి. ఆరవ రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కొన్ని సెంటర్స్ లో అయితే వచ్చిన షేర్స్ కాస్త తిరిగిపోయాయి. ఉదాహరణకు కృష్ణ జిల్లాలో ఈ సినిమాకు నాలుగు రోజులకు కలిపి దాదాపుగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నాల్గవ రోజు , 5వ రోజున జిల్లా వ్యాప్తంగా థియేటర్స్ అన్నిట్లో డెఫిసిట్స్ రావడం తో కోటి 96 లక్షల రూపాయలకు కలెక్షన్స్ పడిపోయాయి. ఇలాగే తూర్పు గోదావరి జిల్లాలో,నైజాం ప్రాంతం లో లో కూడా జరిగింది. అయితే రేపటి వరకు ఈ రెంటల్ బేసిస్ అగ్రీమెంట్స్ ఉంటాయి కాబట్టి, కలెక్షన్స్ లో మరికొంత కోత ఉండొచ్చు.
Also Read: దేశాన్ని కుదిపేసింది.. మోడీ సైతం ప్రశంసించిన సినిమా ఏంటో తెలుసా..?
ఈ సినిమా తెలుగు రాష్ట్రాలకు నాగవంశీ థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మీద ఆయనకు ఉన్న అపారమైన నమ్మకం తో మొదటి వారం మొత్తం ఎట్టి పరిస్థితిలోనూ రెంటల్ బేసిస్ మీద నడపాలని ఒప్పందం చేసుకున్నాడు. అదే ఆయన కొంప మరింత ముంచింది. అసలు ఈ సినిమా నష్టాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన నాగవంశీ కి ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ కూడా రావడం లేదు. ఆయన కెరీర్ లోనే కాదు, గడిచిన రెండు దశాబ్దాలలో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. స్టార్ హీరోలకు ఈ సినిమా ఒక హెచ్చరిక లాగా మారింది. రాబోయే రోజుల్లో స్టార్ స్టేటస్ ని చూసుకొని కంటెంట్ మీద శ్రద్ద పెట్టకపోతే ఏ హీరో కి అయినా ఇదే పరిస్థితి అనడం లో ఎలాంటి సందేహం లేదు.