War 2 Story: సరైన క్యాస్టింగ్ లేకపోయినా కూడా సినిమాలు దారుణంగా బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ ఫైర్ అవుతుంటాయి అనేది మనం చాలా సార్లు చూసే ఉంటాము. రీసెంట్ గా విడుదలైన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం కూడా అలాంటిదే. యాష్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films) సంస్థ ఈ చిత్రంలోకి ఎన్టీఆర్(Junior NTR) రేంజ్ నటుడిని విలన్ గా తీసుకోవడం చాలా పెద్ద తప్పిదం. ఒక సూపర్ స్టార్ ని విలన్ క్యారక్టర్ లోకి తీసుకుంటే కథలో అతని కోసం స్పెషల్ బిల్డప్ షాట్స్ వేసి, అవసరం లేకపోయినా విలనిజం తో కూడిన హీరోయిజం ని బలవంతంగా చూపించి, కథలో ఉన్న ఆత్మని మొత్తం చంపేస్తుంటారు డైరెక్టర్స్. ‘వార్ 2’ విషయం లో కూడా అదే జరిగింది. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అయితే ఎన్టీఆర్ బలవంతం చేయడం వల్ల యాష్ రాజ్ సంస్థ డైరెక్టర్ తో కథలో కొన్ని మార్పులు చేయించింది.
Also Read: తెలుగు సినిమాల్లో ఒక్కప్పటి ఫార్ములాను మళ్ళీ వాడుతున్నారా..?
ముందుగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమా కథ ఎలా రాసుకున్నాడంటే, ఇండియా కి అత్యంత ప్రమాదకరమైన మాజీ స్పై ఏజెంట్ విక్రమ్, మన భారత దేశం మీద పగతో అనేక ప్రాంతాల్లో జరిపే బాంబు పేలుడులను ఏజెంట్ కబీర్ సమర్ధవతం గా ఎదురుకుంటూ, క్లైమాక్స్ లో అతనితో పోరాడి చంపేయడం. ఏజెంట్ విక్రమ్ ఎందుకు ఇండియా కి శత్రువుగా మారాల్సి వచ్చింది అనే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా ఎమోషనల్ గా ఉంటుందట. కానీ ఆయన రాసుకున్న మొదటి కథలో ఒక్కసారి దేశానికీ వ్యతిరేకంగా మారిన విక్రమ్, మళ్ళీ మంచి వాడిగా మారిపోవడం జరగదు, ఇండియా కి శత్రువుగానే చనిపోతాడు. కానీ ఎన్టీఆర్ తాను చనిపోయే క్లైమాక్స్ పెడితే నా అభిమానులు అసలు తీసుకోలేరని, క్లైమాక్స్ లో మార్పులు చేయాల్సిందిగా బలంగా కోరడంతో, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అయిష్టం గానే మార్చాడట.
అలా మార్చడం వల్ల ఫలితం ఇది. చివర్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఆ రేంజ్ లో ఫైటింగ్ చేసుకొని హృతిక్ రోషన్ అకస్మాత్తుగా ఎన్టీఆర్ పై సానుభూతి చూపించడం, ఎన్టీఆర్ కూడా అందుకు ఎమోషనల్ అయిపోవడం, ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఎన్టీఆర్ కూడా ఇండియన్ స్పై లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, మన దేశం కోసం పనిచేయడం వంటివి జనాలకు కనెక్ట్ అవ్వలేదు. అతను విలన్ గానే చనిపోయి ఉండుంటే సహజత్వానికి దగ్గరగా ఉండేది, సినిమా కూడా భారీ హిట్ అయ్యేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఒక ఆంగ్ల పత్రిక రాసిన ఈ కథనం సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా మారింది. కథ మార్చకుండా ఉండుంటే ‘వార్ 2’ హిట్ అయ్యేదా?, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.