War 2 Movie Drawbacks : హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ హీరోలుగా అయన్ ముఖర్జీ దర్శకత్వంలో చాలా ప్రెస్టేజియస్ గా తెరకెక్కిన వార్ 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందని ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆశలైతే పెట్టుకున్నారు. కానీ మొదటి షో తోనే ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం కొంత వరకు నిరాశ చెందుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. నిజానికి ఆయన ఈ సినిమాని చేయాల్సిన అవసరం కూడా లేదు. టైర్ 2 హీరోతో ఆ క్యారెక్టర్ ని చేయించి ఉంటే బాగుండేది… ఇక నిజానికి ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోవడానికి గల కారణం ఏంటి అంటే స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఒక హాలీవుడ్ సినిమాలా అనిపించిందే తప్ప ఇండియన్ సినిమాల లేదు. ఇక ఈ మూవీ లో ఎమోషన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ పెద్దగా ఎక్కడ వర్కౌట్ కాలేదు.అయితే హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ మూవీ కొంతవరకు నచ్చొచ్చు.
Also Read: కూలీ vs వార్ 2 : ఈ రెండింటిలో ఏది హిట్..? ఏది ఫట్..?
కానీ తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఏ మాత్రం ఎంటర్ టైన్ చేయలేదనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకొని ఈ మూవీ చేశాడు. అయినప్పటికి ఈ సినిమా ఆయనకి తీవ్రమైన నిరాశను మిగిల్చిందనే చెప్పాలి…
ఆయన పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా కూడా ఆయన ఎందుకీ పాత్రని చేయడానికి సిద్ధపడ్డాడు అనే ధోరణిలోనే మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇంతకుముందు రామ్ చరణ్ తో చేసిన త్రిబుల్ ఆర్(RRR) సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆయన పాత్ర సెకండ్ హీరో పాత్ర అంటూ అప్పట్లో చాలా కామెంట్లు అయితే వచ్చాయి.
Also Read: ‘వార్ 2’ క్లైమాక్స్ లో జరగబోయేది ఇదేనా..? ఆడియన్స్ కి ఊహించని ట్విస్ట్!
ఇక వార్ 2 సినిమాలో నెగెటివ్ పాత్రను పోషించడం వల్ల ఎన్టీఆర్ ఇమేజ్ చాలా వరకు తగ్గుతోందే తప్ప ఆయన మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు లేవు. ఇక హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ ఇద్దరు కలిసి సమానంగా సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ ఎన్టీఆర్ పాత్రలో పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం ఆయనకు భారీగా ఎలివేషన్స్ వర్కౌట్ కాకపోవడం ఇవన్నీ ఈ సినిమాకు మైనస్ గా మారాయి…