Mahesh Babu Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా థ్రిల్ కి గురి అవుతున్నారు. రాజమౌళి సినిమా అంటేనే పీక్ థియేట్రికల్ అనుభూతి కలిగిస్తుందని అందరూ బలంగా నమ్ముతారు, అలాంటిది ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడంటే ఆ మాత్రం థ్రిల్లింగ్ అనుభూతి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. #RRR చిత్రం తో మన తెలుగు సినిమాకు హాలీవుడ్ లో కూడా తలుపులను తెరిచాడు. అందుకే ఈసారి ఆయన మహేష్ మూవీ తో హాలీవుడ్ కూడా దద్దరిల్లిపోయే రేంజ్ లో ప్లానింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ గురించి మీ అందరికీ చిన్నపాటి అవగాహాన ఉండే ఉంటుంది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. యాక్షన్ అడ్వెంచర్ అంటే ఇన్ని రోజులు మనం హాలీవుడ్ లో చూసిన రేంజ్ వి కాదు.
Also Read: ‘కూలీ’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా..? ఫట్టా..?
ఈ చిత్రం అంతకు మించి అన్నమాట. రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా. శ్రీరాముడి వంశం నుండి 44 తర్వాత వచ్చిన వారసుడిగా ఇందులో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. జీవిచ్ఛవం లాగా వీల్ చైర్ మీద పడున్న విలన్ (పృథ్వీ రాజ్ సుకుమారన్), మళ్ళీ మామూలు మనిషి అయ్యేందుకు సంజీవని అవసరం ఉంది. ఆ సంజీవని అత్యంత భయంకరమైన ప్రాంతంలో ఉంటుంది. శ్రీరాముడి వంశానికి చెందిన మహేష్ బాబు మాత్రమే దానిని తీసుకొని రాగలడు అని తెలుసుకున్న విలన్, మహేష్ ని బలవంతంగా తీసుకొచ్చి అక్కడికి పంపుతారు. ఈ మధ్యలో జరిగిన అడ్వెంచర్ ప్రయాణమే ఈ చిత్రం. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఇందులో ప్రియాంక చోప్రా కూడా విలన్ గా నటిస్తుంది. హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా ఖరారు అవ్వలేదు. కొంతకాలం గా షూటింగ్ కార్యక్రమాలను నిలుపుకున్న ఈ చిత్రం మళ్ళీ తిరిగి ప్రారంభం కానుంది.
Also Read: కూలీ vs వార్ 2 : ఈ రెండింటిలో ఏది హిట్..? ఏది ఫట్..?
ఆ చిత్ర నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు మేము తీసిన ఔట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. తదుపరి షెడ్యూల్ ని నైరోబి, ఆ తర్వాత తాంజానియాలో ప్లాన్ చేశాము’ అంటూ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ మొదటి వారం నుండి ఈ ప్రాంతాల్లో షూటింగ్ మొదలు కాబోతుంది. రీసెంట్ గానే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఒక చిన్న ప్రీ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన భారీ అప్డేట్ ఎవ్వరూ ఊహించని ప్లానింగ్ తో చెప్తామని, అభిమానుల ఎదురు చూపులకు తగ్గ అప్డేట్ అవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అప్పటికే 50 షూటింగ్ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.