War 2 Advance Bookings: మరో మూడు రోజుల్లో ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇద్దరు యాక్షన్ మాస్ హీరోలు వెండితెర పై తలపెడితే ఎలా ఉంటుందో చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ అభిమానుల్లో ఉన్న ఆత్రుత కామన్ ఆడియన్స్ లో లేదు. అందుకు కారణం ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ రెగ్యులర్ స్పై యాక్షన్ సినిమాల్లో ఉన్నట్లుగానే ఉండడం, కొత్తగా అనిపించకపోవడం, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం ప్రధాన కారణాలు అయితే, ఇదే రోజున విడుదల కాబోతున్న రజనీకాంత్ ‘కూలీ’ చిత్రం కోసం యూత్ ఆడియన్స్ మొత్తం ఆతృతగా ఎదురు చూడడం మరో ముఖ్య కారణంగా భావించవచ్చు. అయితే నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం గట్టి సౌండ్ చేసింది. సోషల్ మీడియా లో ఈ ఈవెంట్ గురించి బాగా మాట్లాడుకున్నారు.
Also Read: సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..విషయం ఏమిటంటే!
ఈ ఈవెంట్ తర్వాత నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ స్పీడ్ బాగా పెరుగుతుందని అభిమానులు ఆశించారు. అలా ఆశించిన ఫ్యాన్స్ కి చెక్కెదురు అయ్యింది. గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకు కేవలం 40 వేల డాలర్లు తెలుగు వెర్షన్ నుండి బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఓవరాల్ గా హిందీ వెర్షన్ తో కలుపుకొని ఇప్పటి వరకు ఈ సినిమాకు $398K డాలర్స్ వచ్చాయి. ఎన్టీఆర్ రేంజ్ కి ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాన్ ఇండియన్ సినిమాల్లో అతి తక్కువ గ్రాస్ ని నమోదు చేసుకున్న సినిమాగా ఈ ‘వార్ 2’ చిత్రం నిలబడబోతుంది. రేపు కనీసం లక్ష డాలర్ల గ్రాస్ బుకింగ్స్ ద్వారా వస్తే పరువు పొయ్యే ప్రీమియర్ నంబర్స్ రాకుండా ఉంటాయి. ఒక వేల రాకపోతే మాత్రం సోషల్ మీడియా లో ట్రోల్స్ వేరే లెవెల్ లో ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ పై ట్రోల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.
నార్త్ అమెరికా లో పరిస్థితి కాస్త బెటర్ అనుకోవచ్చు, కానీ ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. వాస్తవానికి బాలీవుడ్ సినిమాలకు ప్రీమియర్ షోస్ గ్రాస్ భారీగా ఉండవు. మొదటి రోజు వసూళ్లు భారీగా ఉంటాయి. కానీ ‘వార్ 2’ కి అలా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ లాంటి తెలుగు స్టార్ హీరో ఉన్నాడు. దేవర చిత్రంతో ఓవర్సీస్ మార్కెట్స్ లో ఆయన పెద్ద ప్రభంజనమే సృష్టించాడు. ఈ సినిమాకు కూడా అలాంటిదే రీ క్రియేట్ చేస్తాడని అనుకున్నారు, కానీ జరగలేదు. ఈ చిత్రం ఇప్పుడు ప్రధానంగా టాక్ మీదనే ఆధారపడుంది.