Athadu Re Release Collection: కొన్ని చిత్రాలు కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తాయి, రికార్డుల వర్షం కురిపిస్తుంది, భవిష్యత్తులో ఆ రికార్డ్స్ ని ఎవ్వరూ అందుకోలేరు అని మనం మనసులో బలంగా ఫిక్స్ అయిపోతుంటాము. కానీ ఆ సినిమాలు మాత్రం విడుదల తర్వాత బోల్తా కొట్టేస్తూ ఉంటాయి. అలాంటి చిత్రాల జాబితాలో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ‘అతడు'(Athadu Movie) చిత్రం కూడా చేరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో కాస్ట్ ఫెయిల్యూర్ గా నిల్చింది. అంటే సినిమా థియేటర్స్ లో పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో ఆడింది కానీ, పెట్టిన బడ్జెట్ కి తగ్గ లాభాలు మాత్రం రాలేదు. కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ సినిమా పెను సంచలనమే సృష్టించింది. మహేష్ అభిమానులే కాకుండా, ఇతర హీరోల అభిమానులకు కూడా ఈ చిత్రం మోస్ట్ ఫేవరెట్ అనొచ్చు.
Also Read: సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..విషయం ఏమిటంటే!
అలాంటి సినిమాని థియేటర్స్ లో మరోసారి రీ రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి. అతడు చిత్రం రీ రిలీజ్ తో ఎవ్వరూ భవిష్యత్తులో అందుకోలేనంత రికార్డ్స్ ని నెలకొల్పుతామని, మొదటి రోజే పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని కొల్లగొడుతామని, ఇలా మహేష్ ఫ్యాన్స్ చాలా రోజుల నుండి సోషల్ మీడియా సవాళ్లు చేస్తూ వచ్చారు. అలా భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9 న గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టినప్పుడు ఫ్యాన్స్ కి పరిస్థితి అర్థమైపోయింది .దీంతో రికార్డ్స్ కొట్టడం కష్టమే అనుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. సుమారుగా మూడు కోట్ల రూపాయలకు పైగా ఏ చిత్రాన్ని కొనుగోలు చేశారు.
అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 7 కోట్ల రూపాయిల గ్రాస్ కచ్చితంగా రావాల్సిందే. మొదటి రోజు గ్రాస్ ఈ చిత్రానికి రెండున్నర కోటి రూపాయిలు వచ్చింది. రెండు రోజులకు కలిపి మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. దీంతో షేర్ కేవలం కోటి రూపాయిలు మాత్రమే వచ్చింది. అంటే నిర్మాతకు సాలిడ్ గా రెండు కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. ఒక రీ రిలీజ్ చిత్రానికి నష్టపోవడం అనేది ఇప్పటి వరకు మనం ఎక్కడా వినలేదు, అతడు చిత్రం ద్వారా నే మొట్టమొదటిసారి ఇలాంటివి వింటున్నాము. టీవీ టెలికాస్ట్ లో వందల సార్లు జనాలు చూసారు కాబట్టే రీ రిలీజ్ ని ఎవ్వరూ పట్టించుకోలేదు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి మొదటి రోజు రికార్డు ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో, ఫుల్ రన్ రికార్డు ‘ఖలేజా’ తో ఉన్నాయి.