Waltair Veerayya : ప్రతీ సంక్రాంతి లాగానే ఈ సంక్రాంతి కి కూడా పెద్ద హీరోల సినిమాలు వరుసగా పోటీ పడుతున్నాయి..నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ కూడా ఒక్క రోజు తేడా తో విడుదల అవుతున్నాయి..ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది..రెండు సినిమాల ప్రమోషన్ కంటెంట్స్ కూడా జనాల్లోకి బాగా రీచ్ అయ్యాయి.

ఇది ఇలా ఉండగా ఈరోజు వాల్తేరు వీరయ్య కి సంబంధించి మూవీ యూనిట్ మొత్తం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది..ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి తో పాటు రవితేజ మరియు మూవీ యూనిట్ మొత్తం పాల్గొన్నారు..ఈ సందర్భంగా చిరంజీవి సంక్రాంతి క్లాష్ గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఒక జర్నలిస్టు సంక్రాంతి క్లాష్ గురించి అడిగిన ప్రశ్న కి చిరంజీవి సమాధానం చెప్తూ ‘పాతికేళ్ల క్రితం నా హిట్లర్ మూవీ మరియు బాలయ్య బాబు పెద్దన్నయ్య మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయ్యాయి..రెండు కూడా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..మళ్ళీ మా ఇద్దరి సినిమాలు ఒకేసారి సంక్రాంతి సీజన్ లో విడుదల అవుతున్నాయి..అప్పటి హిస్టరీ నే ఇద్దరం మళ్ళీ రిపీట్ చెయ్యబోతున్నాము..రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..చిరంజీవి మరియు బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వద్ద తలపడడం ఇది కొత్తేమి కాదు..గతం లో వీళ్లిద్దరి సినిమాలు చాలానే సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి..కొన్ని సార్లు చిరంజీవి విజయం సాధిస్తే మరికొన్ని సార్లు బాలయ్య బాబు విజయం సాధించాడు..ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి.